సినీ ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. అయితే అప్పట్లో చాలామంది సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు అనే చెప్పాలి. కానీ నేటి తరంలో మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని ప్రజలు అంతగా నమ్మకం లేదు. దీంతో రాజకీయాలలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోలేక పోతున్నారు సినిమా నటులు. సినిమాలలో  ఎంతగా ప్రభావితం చేసినప్పటికీ... ఎంత సూపర్ స్టార్లు అయినప్పటికీ... కోట్ల మంది అభిమానులు ఉన్నప్పటికీ... రాజకీయాల్లో మాత్రం ప్రభావితం చేయలేక పోతున్నారు. రాజకీయాలు బొక్కబోర్లా పడుతూ మళ్ళీ సినిమాలకే పరిమితమవుతున్నారు సినీ నటులు చాలామంది ఉన్నారు. 

 

 

 ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో తమకు తిరుగులేదు అని నిరూపించి ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోలుగా కొనసాగి... ఇప్పటికీ కొనసాగుతూ.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసి... మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలి అనుకున్నా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలకు  మాత్రం చేదు అనుభవమే ఎదురైంది అని చెప్పాలి. ఇంతకీ ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరు అనుకుంటున్నారా... మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్. వీరిద్దరికీ ఒకరికి మించి ఒకరికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరికీ కోట్లల్లో అభిమానులు ఉన్నారు. కానీ వీరికి రాజకీయాల్లో  మాత్రం అంతగా కలిసి రావడం లేదు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ నెంబర్వన్ హీరో గా కొనసాగుతున్న సమయంలో... ప్రజారాజ్యం పార్టీని పెట్టి ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. కానీ చిరంజీవికి రాజకీయాల్లో చేదు అనుభవమే ఎదురైంది. 

 

 

 దీంతో చిరంజీవి తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలకే పరిమితం అయి పోయారు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పేరుతో ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలనుకున్నా..  ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోల అభిమానులు కొదవలేదు. ఇద్దరికీ కోట్లల్లో అభిమానులు ఉంటారు. సినిమాల విషయంలో ఎలా ఉన్నా... రాజకీయాల విషయానికి వచ్చేసరికి అభిమానులే పగోల్లుగా  మారిపోతున్నారు. అభిమానుల ఓట్లే ఈ హీరోలకు పడడం లేదు. దీంతో ఓటమి ఫాలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: