తెలుగు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ నుంచి ఎంతోమంది రాజకీయ నేతలు వనమాల నేర్చుకుని ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ కు ముందు సైతం కొంగర జగ్గయ్య లాంటి వాళ్ళు ఒంగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కు ముందు వరకు సినిమా రంగంలో ఉన్న వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం అరుదుగా జరిగేది. అయితే ఎన్టీఆర్ తర్వాత నుంచి సినిమా రంగంలో రాణించిన వాళ్ళు రాజకీయాల్లోకి రావడం పార్టీలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం ఎక్కువగా జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే మూడు దశాబ్దాల పాటు తిరుగులేని మెగా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. భారీ అంచనాలతో ఎన్నికల్లో ప్రజారాజ్యం నాటి సమైక్య రాష్ట్రంలో కేవలం 18 సీట్లతో సరిపెట్టుకుంది. ఎన్నికల్లో తిరుపతిలో ఎమ్మెల్యేగా గెలిచిన చిరంజీవి తన సొంత జిల్లా అయిన మాత్రం ఓడిపోయారు.

 

ఇక ఇదే జిల్లాలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే ఆయన సోదరుడు నాగబాబు నరసాపురం నుంచి జనసేన పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోవడంతో పాటు ఏకంగా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విచిత్రమేంటంటే మెగా బ్రదర్స్ ముగ్గురిని వాళ్ల సొంత జిల్లాలో సొంత జిల్లా ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే నాగబాబు ఎంపీగా పోటీచేసి పరాజయం పెట్టుకోవాల్సి వచ్చింది.

 

ఇక 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం తో పాటు విశాఖ జిల్లాలోని గాజువాక నుంచి పోటీ చేశారు. పవన్ ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోవడం ఆయనకు ఘోరమైన అవమానంగా నిలిచింది. ఈ ఎన్నికల్లో జనసేన తూర్పు గోదావరి జిల్లాలోని ఒక రాజోలులో మాత్రమే విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: