తెలుగు సినిమా రంగంలో గత నాలుగు దశాబ్దాలలో టాప్ హీరోలు ఎవరు అన్నది విశ్లేషించుకుంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ ఎన్టీ రామారావు. తర్వాత ఆ స్థాయి క్రేజ్ ఒక మెగాస్టార్ చిరంజీవి కి వచ్చింది. ఎన్టీఆర్ అయితే సినిమాల్లో నెంబర్ వన్ హీరోగా ఉంటూ రాజకీయాల్లోకి వెళ్లి పోయారు. ఆ తర్వాత స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవి సొంతం చేసుకొని ఏకంగా మూడు దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన చేశారు. ఓ మకుటం లేని మహారాజుగా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తిరుపతి నుంచి పోటీ చేసి అసెంబ్లీ లోకి అడుగుపెట్టారు. తిరుపతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉండడంతో ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ ప్రకారం అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయగా విజయం సాధించడంతో పాటు పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది.

 

 ఎన్టీఆర్ తిరుపతి తో పాటు కృష్ణా జిల్లాలోని తన నియోజకవర్గం అయిన గుడివాడ నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ తరహాలోనే తాను కూడా తిరుగులేని మెజార్టీతో విజయం సాధించి సీఎం అవుతారని ఓపెన్ గానే పోయేవారు. ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ అభిమానులు అయితే చిరంజీవి ఎన్టీఆర్ ను మించిన రాజకీయ నాయకుడు అవుతాడు అని కూడా అనేవారు. చిరంజీవి సైతం ఎన్టీఆర్ లాగానే తన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు తో పాటు ఎన్టీఆర్ పోటీ చేసిన తిరుపతి సెంటిమెంట్‌ను కూడా కొనసాగిస్తూ వచ్చారు. అయితే చిరంజీవి పూర్తిగా బొక్క బోర్లా పడ్డారు. సొంత జిల్లా అయిన పాలకొల్లులో ఒక మహిళ అభ్యర్ధి చేతిలో ఓడిపోగా తిరుపతిలో చావుతప్పి కన్నులొట్ట పోయినట్లు చందంగా విజయం సాధించారు.  తిరుపతి లో చిరంజీవికి కేవలం 10 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది.

 

 చిరంజీవి ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఒక అవమానం. అయితే ఆయన పార్టీ కూడా నాటి సమైక్య రాష్ట్రంలో కేవలం 18 స్థానాలతో మాత్రమే సరిపెట్టుకుంది. అలా ఎన్టీఆర్ స్టైల్ లోనే పార్టీ పెట్టి ఎన్టీఆర్ ను మించిన రాజకీయ నేతగా ఎదుగుతాం అని ఎన్నో కలలు కన్నా చిరంజీవి ఘోరమైన అవమానంతో తన రాజకీయ చరిత్రను తానే ముగించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: