ఈ మధ్యకాలంలో అటు సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఆ స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందని ప్రచారం కూడా జోరందుకుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు తమిళ స్టార్ హీరో విజయ్. గత కొంతకాలంగా తమిళ స్టార్ హీరో విజయ్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ పైన వరుసగా ఐటీ దాడులు జరగడం... అంతేకాకుండా విజయ్ సినిమా షూటింగ్ పై కూడా బిజెపి నేతలు దాడి చేయడం.. ఇలాంటి ఘటనలు పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే బిజెపి పార్టీ కక్షకట్టి మరి తమిళ స్టార్ హీరో విజయ్ పై ఐటీ దాడులు జరిపిస్తున్నదని  అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. 

 

 

 కావాలనే కక్షసాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ నేతలు విజయ్ షూటింగు అడ్డుకుంటున్నారని అంతేకాకుండా బీజేపీ పెద్దలు స్టార్ హీరో విజయ్ పై వరుస ఐటీ దాడులు చేస్తున్నారని అప్పట్లో పెద్ద ప్రచారమే జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయ పార్టీలు విజయ్ కి అండగా నిలబడ్డారు. విజయ్ కి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామంటూ తెలిపాయి రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలోనే విజయ్ కి సంబంధించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని... ఇది ముందుగానే గమనించిన బీజేపీ పార్టీ తమిళ హీరో విజయ్ పై కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తుంది ఎన్నో గుసగుసలు కూడా వినిపించాయి. 

 

 

 ఇక నిజంగానే తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు  అని తమిళ సినీ వర్గాల్లో కూడా గుసగుసలు  వినిపిస్తున్నాయి. త్వరలో తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతున్నాడని  అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే స్టార్ హీరో విజయ్ కి తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక తమిళ నాట సినీ చిత్ర పరిశ్రమకు చెందిన నటులను రాజకీయాల్లో  ప్రజలు ఎంతగానో ఆదరిస్తారు. ఈ నేపథ్యంలోనే విజయ్ కూడా రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఒకవేళ విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఏదైనా పార్టీలో చేరుతారా లేదా సొంత పార్టీని పెట్టి రాజకీయాల్లోకి వస్తారా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: