సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన వారిలో కొందరు ప్రజలకు సేవ చేయాలనే ఆశ, తలంపుతో ఉంటారు. అయితే.. సినిమాల్లో బాగా రాణించిన తర్వాత.. వయసు 50-60 మధ్య ఉన్నప్పుడు వారు రాజకీయ అరంగేట్రం చేస్తారు. కొందరు సొంతంగా పార్టీ స్థాపిస్తే మరికొందరు అప్పటికే ఉన్న పార్టీల్లో చేరి ప్రజా సేవ చేస్తారు. సినిమాల్లో అప్రతిహత స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. సినిమాల్లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న తర్వాత ఆయన రాజకీయాల వైపు మళ్లారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి ఆ పార్టీలో చేరారు.

 

 

1989లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరు నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో స్నేహం కూడా ఆయన రాజకీయాల్లోకి రావడానికి కారణమైంది. దీంతో మళ్లీ ఆయన రాజకీయాల వైపు చూడలేదు. రాజకీయాలను పూర్తిగా వదిలేసి మళ్లీ సినిమాల్లో నటించారు. రాజకీయాల అనంతరం నెంబర్ వన్, అమ్మదొంగా వంటి హిట్ సినిమాలు చేసారు. ఆయన తర్వాత ఆయన తమ్ముడు ఆదిశేషగిరి రావు రాజకీయాల్లో కొనసాగ

 

 

కృష్ణ తనయుడు మహేశ్ బాబు 1999లో సినిమాల్లోకి పూర్తిస్థాయి హీరోగా తెరంగేట్రం చేశాడు. అప్పటి వరకూ కృష్ణ అలెపెరగకుండా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. మహేశ్ ఎంట్రీ తర్వాత ఆయన నటనకు దాదాపుగా దూరమయ్యారు. అడపాదడపా సినిమాల్లో నటించారు. కొన్నేళ్లుగా ఆయన పూర్తిగా సినిమాలకు దూరమై విశ్రాంతి తీసుకుంటున్నారు. కృష్ణ సినీ వారసత్వాన్ని తనయుడు మహేశ్ బాబు ఘనంగా నిలబెట్టాడు. కానీ కృష్ణకు ఉన్న రాజకీయపరమైన ఆకాంక్ష తనయుడు మహేశ్ కు మాత్రం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: