హేమ మాలిని... భారతీయ సినిమాలో ఒక ముద్ర వేసిన నటి. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసారు. భారతీయ సినిమాలో హేమ మాలిని అనగానే ఒక బ్రాండ్. ఆ విషయం అందరికి తెలిసిందే. అగ్ర హీరోలతో హిట్ సినిమాలు చేసారు హేమ మాలిని. బాలీవుడ్ లో ఆమె సినిమాలు అనగానే ఒక క్రేజ్ ఉండేది. హీరోలతో సమానంగా ఒక రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. పారితోషిక౦ కూడా అదే స్థాయిలో తీసుకునే వారు ఆమె. ఆ తర్వాత హీరోయిన్ గానే కాకుండా కేరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 

 

ఇక ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో కూడా అడుగు పెట్టారు. 1999 లో, హేమ మాలిని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి, మాజీ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా కోసం పంజాబ్లోని గురుదాస్‌పూర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఫిబ్రవరి 2004 లో, హేమ మాలిని అధికారికంగా బిజెపిలో చేరారు. 2003 నుండి 2009 వరకు, ఆమె రాజ్యసభకు ఎంపిగా పనిచేశారు. మార్చి 2010 లో, హేమ మాలినిని బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియమించారు.  మరియు ఫిబ్రవరి 2011 లో, పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత్ కుమార్ ఆమెను సిఫారసు చేశారు. 

 

2014 సార్వత్రిక ఎన్నికలలో లోక్సభకు ఎన్నికయ్యారు. ఇలా రాజకీయాల్లో కూడా ఆమె సత్తా చాటారు. సోషల్ మీడియాలో ఆమె కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కోసం కాంగ్రెస్ ఎన్నో సార్లు ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం బిజెపిలోనే ఉన్నారు. ఆమెపై రాజకీయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఎంతో మందికి డ్రీం గర్ల్ గా సినిమాల్లో ఆమె కనిపించారు. ఆమె సినిమా అనగానే సెలవలు పెట్టి చూసే వారు అప్పటి యువత. ఆ విధంగా రాజకీయాల్లో కూడా తన ముద్ర వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: