సినిమా నటుల్లో ఓ కుటుంబం నుంచి వచ్చిన వారు ఎక్కువ మందే ఉండొచ్చు కానీ.. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సూపర్ స్టార్లు రావడం మాత్రం ఈ ఇండస్ట్రీలో కూడా జరగలేదు. కానీ తెలుగులో మాత్రం చిరంజీవి ఎంతటి మాసివ్ ఇమేజ్ తో మెగాస్టార్ గా నెంబర్ వన్ అయ్యారో.. ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అంతే అప్రతిహత మాసివ్ ఇమేజ్ సొంతం చేసుకోవడం విశేషం. ఇద్దరూ సినిమాల్లో రాణించి అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇద్దరూ సినిమాల్లో కెరీర్ పీక్స్ లో ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారు.

 

 

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగించలేకపోయింది. అనంతరం చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 ఎన్నికల అనంతరం ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమైపోయారు. 2017లో తిరిగి సినిమాల్లోకి వచ్చి కమ్ బ్యాక్ మూవీగా ఖైదీ నెంబర్ 150 చేశారు. ఆ సినిమా ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సాధించి ఏకంగా 100కోట్ల షేర్ సాధించింది. తర్వాత 2019లో చేసిన సైరా కూడా 100కోట్ల షేర్ సాధించి సినిమాల్లో తన సత్తా ఏస్థాయిలో ఉంటుందో చాటారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. తిరిగి మళ్లీ సినిమాలు చేస్తున్నారు. రెండేళ్ల తర్వాత ఆయన వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

 

 

రాజకీయాల నుంచి చిరంజీవి తిరిగొచ్చి సినిమాల్లో తన స్థాయి ఎలా చూపించారో.. పవన్ కల్యాణ్ కూడా అలాంటి మ్యాజిక్కే చేయాలని మెగా అభిమానులు, పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ సినిమాలు ఫెయిలయినా క్రేజ్ అలానే ఉంటుంది. అజ్ఞాతవాసి ఓపెనింగ్ డే కలెక్షన్లే ఇందుకు నిదర్శనం. వచ్చే మే15న వకీల్ సాబ్ విడుదల కానుంది. క్రిష్ తో చేస్తున్న సినిమా కూడా లైన్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: