హీరోగా ఎంట్రీ ఇచ్చినా విలన్ గానే ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత మళ్లీ హీరోగానే  కెరీర్  కంటిన్యూ చేస్తున్నాడు. కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. అందుకే మళ్లీ కెరీర్ కి కలిసొచ్చిన విలన్ రూట్లోకే వెళదామనుకుంటున్నాడేమో.. సూపర్ స్టార్ తో ఫైట్ కి రెడీ అవుతున్నాడట  ఈ మాస్ హీరో.

 

మాస్ యాక్షన్‌ హీరోగా మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న గోపిచంద్‌, సక్సెస్‌ ఫుల్‌ హీరో అనిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మాస్ హీరోకు కావల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. భారీ బడ్జెట్ తో ఎనర్జిటిక్ పర్ ఫామెన్స్ ఇస్తున్నా ఎక్కడో అనుకున్న సక్సెస్ మాత్రం రావడం లేదు. అందుకే ఈ సారి విలన్ గా లక్ చెక్ చేసుకోబోతున్నాడు గోపీచంద్.

 

గోపీచంద్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో విలన్ గా చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం శివ-రజనీకాంత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ గా గోపీచంద్ ని అడిగాడట శివ. శివ గోపీచంద్ తో అంతకుముందు ఓ సినిమా చేశాడు. అదే లీనియన్స్ తో.. గోపీని రజనీకాంత్ కి విలన్ గా నటించమని అడిగాడని, అందుకు గోపీచంద్ కూడా ఒకే చెప్పాడని రూమర్ నడుస్తోంది.

 

ప్రస్తుతం రజనీకాంత్, శివ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. గోపీచంద్ సూపర్ స్టార్ సినిమాలో విలన్ గా కనిపిస్తే.. గోపీచంద్ కెరీర్ లో పెద్ద బ్రేక్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే గోపీ కెరీర్ లో హీరోగా కన్నా విలన్ గానే మంచి మార్కులు పడ్డాయి. గోపీచంద్ విలన్ గా నటించిన జయం, నిజం, వర్షం సినిమాలు సూపర్ హిట్ అయ్యి గోపీచంద్ కెరీర్ లో మంచి పర్ ఫామెన్స్ క్యారెక్టర్స్ గా నిలిచిపోయాయి. ఇప్పుడొస్తున్న రూమర్స్ చూస్తుంటే.. తనకు కలిసొచ్చిన నెగెటివ్ రోల్ నే నమ్ముకునేలా కనిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: