పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అటు పింక్ రీమేక్ వకీల్ సాబ్ లోనూ, ఇటు క్రిష్ దర్శకత్వంలో విరూపాక్షలోనూ ఒకేసారి నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్.  ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ లు శరవేగంగా జరుపుకుంటున్నాయి. అయితే వకీల్ సాబ్ చిత్రం నుండి ఏదో ఒక అప్డేట్ అధికారికంగా వస్తూనే ఉంది. అలాగే క్రిష్ సినిమా నుండి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే అనధికారికంగా వైరల్ అవుతూనే ఉంది.

 

 

 

క్రిష్ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి  వరకు ఏదీ అధికారికంగా రివీల్ చేయలేదు. చివరికి పేరు కూడా విరూపాక్ష అని సోషల్ మిడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే బయటపడింది గానీ చిత్ర బృందం మాత్రం టైటిల్ ని కన్ఫర్మ్ చేయలేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటు దొంగ పాత్ర చేస్తున్నాడని, కోహీనూర్ వజ్రం గురించిన కథ ఉంటుందని, అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో సినిమా షూటింగ్ జరుగుతుందని వార్తలు వచ్చాయి.

 

 

 


ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై రోజుకో పుకారు చెలరేగుతుంది. నిన్నటి వరకు బాలీవుడ్ నటి జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ని తీసుకున్నారని ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఆమె స్థానంలో ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకోవాలని చూస్తున్నారట. జాక్వెలిన్ డేట్లు కుదరకపోవడంతో ఆమె స్థానంలో కొత్త అమ్మాయిని తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు.

 

 

ప్రస్తుతానికి ఈ వార్త కూడా అధికారికంగా రాకపోయినప్పటికీ ఇదే నిజమని అంటున్నారు. సోలో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకుని, సెకండ్ హీరోయిన్ గా ప్రగ్యాజైశ్వాల్ ఉంటుందని చెబుతున్నారు. మరి ప్రగ్యాజైశ్వాల్ కొత్త అమ్మాయి పక్కన చేస్తుందా లేదా అన్నదే సందేహం.

మరింత సమాచారం తెలుసుకోండి: