తెలుగు తెర సంచలనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొంచెం విరామం ఇచ్చి, సినిమాలు చేస్తున్న సంగతి అందరికి విదితమే. ఆ కోవలోనే ఇటీవల రిలీజు అయిన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ మూవీ ఫస్ట్ సాంగ్ "మగువా ఓ మగువా" ఎలాంటి ప్రభంజనాలు క్రియేట్ చేస్తున్నాయో అందరికి బాగా తెలిసినదే. ఇక అదే అదనుగా పవర్ స్టార్ వరుస సినిమాలను ప్రకటించిన సంగతి కూడా తెలిసినదే.

 

ఏకంగా మూడు సినిమాలు పవన్ కోసం రెడీ అవ్వబోతున్నాయి.. ఇప్పటికే రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. ఇక మూడవది ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇక తన 26వ చిత్రంగా `వకీల్ సాబ్` చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది. దీనికి వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణ ఆఖరి స్టేజ్ కు చేరుకుంది. తరువాత  ఈ నెల 21 నుంచి ఫైనల్ షెడ్యూల్ జరుగుతుందట.

 

అయితే ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. మామ్మూలుగా పింక్ మాతృకలో కథ మొత్తం డైలాగుల మీదే నడుస్తుంది, కానీ వకీల్ సాబ్ చిత్రానికి పవన్ మార్క్ కమర్షియల్ అంశాల మేళవింపుగా సినిమాను రంగ రిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే పలువురు హీరోయిన్లను తీసుకుంటున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా గోవా బ్యూటీ ఇలియానా పేరు ప్రస్తుతం వినిపిస్తోంది. ఆమె అయితేనే అతనికి సరియైన జోడి అని టాలీవుడ్ ఫీల్ అవుతుందట.

 

తదుపరి ఈమెతో పాటుగా... గబ్బర్ సింగ్ నాయిక శృతి హాసన్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు వినికిడి. ఇక  ఇలియానా పవన్ తో గతంలో 'జల్సా' చిత్రంలో నటించిన సంగతి అందరికి తెలిసినదే. శృతి హాసన్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాల్లో మెప్పించింది. పవన్ కళ్యాణ్ కు జోడిగా వీరిద్దరు బాగానే వుంటారు. అయితే వారిలో ఒక్కరినే తీసుకుంటారా లేదంటే... ఇద్దరికీ బుక్ చేసుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: