టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మనదేశం సినిమా ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, ఆ తరువాత నుండి మెల్లగా తన ఆకట్టుకునే నటనా టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. అప్పట్లో సాంఘికాలు, పౌరాణికాలు, జానపదాల అనే తేడా లేకుండా అన్ని రకాల జానర్లలో సినిమాలో చేసిన అన్న గారు, కృష్ణుడి పాత్ర చేసారంటే, సాక్ష్యాత్తు ఆ భగవంతుడే మన ముందు ప్రత్యక్షం అయ్యాడా అనేంతలా ఆ పాత్రలో జీవించేవారు. ఇక ఆ తరువాత నుండి మెల్లగా ఎన్టీఆర్ ప్రభంజనం మొదలైంది.

 

ఒక్కసారిగా అప్పట్లో అతి పెద్ద సూపర్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్, ఆపై 1983లో తెలుగు ప్రజల యొక్క ఆత్మరక్షణ కోసం తెలుగు దేశం పార్టీని నెలకొల్పి, అనంతరం జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో అత్యధిక సీట్లతో విజయాన్ని సొంతం చేసుకుని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించారు. అయితే అప్పటికే పార్టీ మ్యానిఫెస్టో సమయంలో ప్రకటించిన అన్ని హామీలు కూడా అన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని అమలు చేసి మంచి పేరు సంపాదించారు. ఆపై మద్యపాన నిషేధం, ఆడవాళ్లకు కూడా ఆస్తిలో హక్కు, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పధకాలు అన్నగారికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అక్కడి నుండి తెలుగు ప్రజల యొక్క మన్ననలు అందుకుంటూ రాజకీయాల్లో దూసుకెళ్లిన అన్నగారు, ఆపై పార్టీలో కొద్దిపాటి అంతర్గత విబేధాలు, అలానే అప్పట్లో పార్టీని చంద్రబాబు మెల్లగా దక్కించుకుని ఆయనను ప్రక్కకు నెట్టేయడం వంటి పరిణామాలతో కొంత కలత చెందారు. 

 

అయితే మొదటి నుండి ఎన్టీఆర్ పరిపాలన పై తెలుగు ప్రజలకు ఎనలేని నమ్మకం ఉండడంతో పాటు అప్పట్లో దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలిస్తున్న కాంగ్రెస్ కు ధీటుగా టిడిపిని నెలకొల్పి విజయఢంకా మ్రోగించిన ఎన్టీఆర్, తప్పకుండా మళ్ళి పార్టీ పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. అయితే అనంతరం జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఎన్టీఆర్ కొంత కృంగిపోవడం, ఆ తరువాత హఠాత్తుగా మరణించడం జరిగింది. అయితే తాను జీవించి ఉన్నత కాలం, అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా భారీ ప్రభంజనాన్ని సృష్టించిన ఘనత ఒక్క అన్నగారికి దక్కుతుందని చెప్పవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: