అదేంటీ ఆర్ఆర్ఆర్ మూవీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు... ఎన్టీఆర్, రామ్ చరన్ మల్టీస్టారర్ మూవీ.. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించబోతున్నారని ఇప్పటికే టాలీవుడ్ అంతా టామ్ టామ్ అయ్యింది.  మరి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరో దర్శకుడు రావడం ఏంటా అని అనుకుంటున్నారు.  అసలు విషయానికి వస్తే.. చిత్రం సినిమాతో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు డైరెక్టర్ తేజ.  ఆ తర్వాత నితిన్, సదా జంటగా జయం సినిమాతో మరో సంచలన విజయం అందుకున్నాడు.  ఈ సినిమా అప్పట్లో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. 

 

ఆ తర్వాత తేజ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘నిజం’ ఓ మెసేజ్ ఓరియెంటెడ్ గా వచ్చింది.  ఈ మూవీ తర్వాత తేజ తీసిన ఏ సినిమా సక్సెస్ కాలేదు.  చాలా కాలం గ్యాప్ ఇచ్చిన తేజ ఆ మద్య రానా దగ్గుబాటి, కాజల్ జంటగా ‘నేనే రాజు నేనే మంత్రి’ తో మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా ‘సీత’ తెరకెక్కించాడు.. కానీ ఈ మూవీ సక్సెస్ కాలేదు.  మరోసారి రానా హీరోగా మరో మూవీ తెరకెక్కిస్తున్నాడు. 'రాక్షస రాజ్యంలో రావణాసురుడు' అనే టైటిల్ ను పెట్టారు. 

 

ఈ మూవీలో రానా ముగ్గురు హీరోయిన్లతో నటించబోతున్నారట. ఇప్పటికే ఒక హీరోయిన్ గా కాజల్ ను ఎంచుకున్నాడు తేజ.  మరో ఇద్దరు హీరోయిన్స్ కోసం వేటలో ఉన్నారట. అయితే నేనే రాజు నేనే మంత్రి పొలిటికల్ బ్యాగ్ గ్రౌండ్ తో మంచి మేజేస్ ఓరియెంటెడ్ గా తెరకెక్కించారు.  డబ్బుతో పలుకుబడి మాత్రమే కాదు రాజీకీయాన్ని కూడా శాసించవొచ్చు అన్న కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కించారు.  మరి ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు' లో రానాని ఎలా చూపించబోతున్నాడో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: