ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ బ్యూటీలో వరుసగా ఎంట్రీ ఇస్తున్నారు.  అప్పట్లో నాగశౌర్య నటించిన ‘జాదుగాడు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సోనారిక.  ఆ తర్వాత మంచు విష్ణు నటించిన ‘అడో రకం.. వీడోరకం’ చిత్రంలో నటించింది.  ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై వచ్చిన ‘హర హర మహాదేవ్’ సీరియల్ లో పార్వతి దేవిగా నటించింది.  ఆ సీరియల్ లో ఆమెను చూస్తు భక్తి ఉప్పొంగి పోయింది.  ఇక వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ముద్దుగుమ్మ రెచ్చిపోయిన నటించింది.  హాట్ లుక్ తో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.

అయితే ఈ అమ్మడు నటించిన రెండు తెలుగు చిత్రాల్లో పెద్దగా గుర్తింపు రాలేదు.. దాంతో మరోసారి బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ప్రస్తుతం తెలుగు తెరపై  మూవీ కోసం ఎదురు చూస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.  కాకపోతే ఇప్పటికే ఇక్కడ అప్ కమింగ్ హీరోయిన్ల కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది.  ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు గా ఉన్నవారు కుర్ర హీరోలతో సైతం నటించేందుకు సిద్దమవుతున్నారు.  కాజల్, నయనతార, త్రిష లాంటి వారు గ్లామర్ ప్రదర్శనకు సిద్దమవుతున్నారు. 

ఇలాంటి సమయంలో ఈ బ్యూటీ ఛాన్సులు దక్కించుకొని హీరోయిన్ గా రాణించాలంటే కష్టమే అయినా.. ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూస్తుంది.  ప్రస్తుతం హీరోయిన్లకు సరైన వేధిక సోెషల్ మీడియా.  ఇందులో హీరోయిన్లు హాట్ లుక్ తో ఫోటో షూటింగ్ లో పాల్గొంటూ.. అవి సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.  ఇలాంటి ఫోటోలకు కుర్రాకారు ఫిదా అవుతున్నారు.  కాకపోతే దర్శక, నిర్మాతల దృష్టిలో పడాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు కొంత మంది హీరోయిన్లు. ముఖ్యంగా బాలీవుడ్ లో మోడల్స్, ఛాన్సులు లేని హీరోయిన్లు దర్శక, నిర్మాతల దృష్టిలో పడాలని బోల్డ్ లుక్ ఫోటోలు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: