తెలుగు ఇండస్ట్రీలో 80వ దశకంలో స్టార్ హీరోలతో పాటు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటుడు మురళీ మోహన్.  అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సైతం ఈయన పక్కన చిన్న క్యారెక్టర్ లో నటించాడంటే.. అప్పట్లో మురళీ మోహన్ కి క్రేజ్ అలా ఉండేది.  నటుడిగానే కాదు మంచి వ్యాపారవేత్తగా మురళీ మోహన్ సత్తా చాటుకున్నారు.  జయభేరి గ్రూపు అధిపతి రియలెస్టేట్ రంగంలో ప్రముఖ నటుడు శోభన్ బాబు బాటలో నడిచాడు.   2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుండి గెలిచాడు. ఒకప్పుడు హీరోగా నటించిన ఆయన తర్వాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలను పోషించారు. 

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు..  అప్పట్లో స్వాతంత్ర ఉద్యమం సాగుతున్న సమయంలో నేను పుట్టాను.  అందుకే నా పేరు 'రాజా రామ్మోహన్ రాయ్' అనే పేరు పెట్టారు.  అయితే నేను చదివిన కాలేజ్ లో నా పేరు రాజబాబు అని పిలవడం మొదలు పెట్టారు.  అప్పట్లో చిన్న చిన్న నాటకాలు వేస్తూ ఉండేవాళ్లం.. అలా ఇండస్ట్రీవైపు అడుగులు పడ్డాయి.  చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత అప్పటికే రాజబాబు అని పేరుతో స్టార్ కమెడియన్ ఉన్నారు.. నీ పేరు మార్చుకో అని  నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుగారు అన్నారు. దాంతో నా పేరును 'మోహన్' గా మార్చుకున్నాను. 

 

అప్పుడు జర్నలిస్ట్ శ్రీనివాస్ నా పేరు సింగిల్ గా మోహన్ అంటే బాగా లేదు..   కృష్ణమోహన్,రామ్మోహన్ , మురళీమోహన్ ఏదైనా మార్చుకోమని అన్నారు.  అప్పుడు నాకు మురళీ మోహన్ బాగా నచ్చడంతో ఇండస్ట్రీలో అదే పేరు తో కంటిన్యూ అయ్యానని చెప్పుకొచ్చారు. అలా నా పేరు మార్చుకున్న కొత్తలో వరుసగా విజయాలు అందుకున్నాను.  ఇంట్లో కూడా అదే పేరు కంటిన్యూ చెయమని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: