టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల అలా వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో అమాంతం ఆయన లెవెల్, క్రేజ్ మారిపోయింది. అయితే.. ఈయనకు అబ్బాయిల్లో కాకుండా అమ్మాయిల్లో కూడా ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో బన్నీపై కొందరు లేడీ ఫ్యాన్స్ క్రష్ చూపించడం  బయటపడుతుంటుంది. తమ అభిమానాన్ని కొందరు అమ్మాయిలు ప్రేమ రూపంలో వ్యక్తపరిచిన వారు ఎందరో..

 

 

కొన్నిసార్లు పబ్లిక్ వేదికలపైనే అమ్మాయిలు బన్నీ ప్లీజ్ ఒక్కసారి! అంటూ రచ్చ చేసిన విషయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. అందరి హీరోలపై అభిమానం ఒక రకంగా ఉంటే బన్నీ పై మాత్రం వేరే రూపంలో ఉంటుందట. అభిమానుల ప్రేమకు ఫిదా అవుతుంటారు బన్నీ. ఇక సోషల్ మీడియాలో అయితే తనదైన శైలిలో రిప్లై ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు బన్నీ..

 

 

 

స్టైలిష్ స్టార్ కు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న అతడి క్రేజ్ మాత్రం అమ్మాయిల్లో కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పటికీ అదే క్రేజ్ ను కంటిన్యూ చేస్తున్నాడు అర్జున్. కాగా., బన్నీ.. స్నేహకు  పెళ్లయి 9సంవత్సరాలు పూర్తయింది. పెళ్లయ్యాక బన్నీ బాధ్యతల్లో కొన్ని స్నేహ తీసుకుంది. ఈ నేపధ్యంలో బన్ని సోషల్ మీడియాల్ని స్నేహనే మ్యానేజ్ చేస్తోందట. అయితే.. ఈ తరుణంలోనే స్నేహ కు కొన్ని ఆసక్తికరమైన సంగతులు తెలిసిపోయాయట. 

 

 

బన్నీ సోషల్ అకౌంట్స్ స్నేహ హ్యాండిల్ చేస్తుండగా... ఈ విషయం లేడీ ఫ్యాన్స్ కి తెలియకపోవడంతో ఖంగు తినాల్సి వస్తోందట. అయితే ఓ ఇంటర్వూలో లేడీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ తనని అంతగా ఇబ్బంది పెట్టలేదని.. చెప్పుకొచ్చారు బన్నీ. వారితో  చాలా హుందాగానే నడుచుకున్నారని చెబుతుంటాడు. స్నేహ కంట్రోలింగ్ కూడా తనపై బానే ఉంటుందని చెప్పారు. గీత దాటకుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది అంటూ కవరింగ్ ఇచ్చేశాడు. ఇంకా ఇన్నేళ్ల జీవితంలో మా ఇద్దరి మధ్య దాపరికాలు ఉండవని, మాకు ఎలాంటి గొడవలు లేవని చెప్పేశారు బన్నీ.

మరింత సమాచారం తెలుసుకోండి: