అమలాపాల్ గురించి పరిచయం అక్కర్లేదేమో.. తన అందం, చందం, అభినయం గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తమిళనాట కెరీర్ ప్రారంభించిన అమల, తెలుగు వారిని కూడా మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఆమధ్య కాలంలో ఈమె ప్రముఖ తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి.. తరువాత కొంతకాలానికి ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చి విడిపోయిన విషయం అందరికి విదితమే.
ఆ తర్వాత ఆమె తన కాన్సంట్రేషన్ మొత్తం తన సినిమాలపైనే కేంద్రీకరించింది. అయితే ఇటీవల ఈమె వేరొక వ్యక్తితో పిలల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అమలాపాల్ రిలేషన్ లో వున్న సదరు వ్యక్తి పేరు 'భవిందర్ సింగ్' అట. పేరుని బట్టి అతడు ముస్లిం అని తెలుస్తోంది. అయితే మామ్మూలుగా క్రిస్టియన్ అయిన అమలాపాల్, ఒక ముస్లిం ను ప్రేమించడమేంటి అని ఆమె అభిమానులు ఆమె మీద విమర్శనాస్త్రాలను విసురుతున్నారట!
ఇక వారు మాత్రం.. మతాలతో సంబంధం లేకుండా, ఇద్దరూ ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ సహజీవనం చేస్తున్నారని కోలీవుడ్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ‘ఆడయ్’ సినిమా విడుదల సందర్భంగా..అమలాపాల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ.. "తాను ప్రేమలో మునిగి తేలుతున్నానని, తాను సినిమాలు ఎంపిక చేసుకునేటపుడు తన ఫార్ట్నర్ను కూడా సంప్రదిస్తానని" అమ్మడు చెప్పడం... అది వారి ప్రేమకు తార్కాణంగా కనబడుతుంది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఓ వైపు ప్రేమలో ఉన్నట్లు చెబుతూనే..ఆ వ్యక్తి ఎవరో చెప్పుకుండా మాట దాట వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజా గుస గుసల నేపథ్యంలో అమలాపాల్ ప్రేమిస్తున్న వ్యక్తి భవిందర్ సింగ్ అని అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ వార్తలపై అమలాపాల్ ఏవిధంగా స్పందిస్తుందో... కొసమెరుపు ఏమంటే, భావ్నిందర్ సింగ్ ఇతడేనంటూ తెలిపే కొన్ని ఫొటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.. ఆఫొటో మీరూ చుడండి...