మెగాస్టార్ చిరంజీవి, కేఎస్ రామారావు, కోదండరామిరెడ్డి, ఇళయరాజా, యండమూరి వీరేంద్రనాధ్.. ఈ కాంబినేషన్ కు ఓ బ్రాండ్ ఉంది. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, స్టూవర్టుపురం పోలిస్ స్టేషన్.. ఈ సినిమాలన్నీ ఈ కాంబినేషన్ లో వచ్చినవే. వీటిలో అభిలాష సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. ఉరిశిక్షను రద్దు చేయాలనే తన అభిలాషను ఓ లాయర్ కోర్టులో కళ్లకు కట్టినట్టు చూపిస్తూ.. అనుకోకుండా తానే ఉరిశిక్షకు బలి కాబోయే పాత్ర సినిమాను రక్తి కట్టిస్తుంది. ఈ సినిమా విడుదలై నేటికి 37 సంవత్సరాలు పూర్తయ్యాయి.

IHG

 

1983 మార్చి 11న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. లాయర్ పాత్రలో చిరంజీవి జీవించారనే చెప్పాలి. సినిమా సెకండాఫ్ మొత్తం రోమాలు నిక్కబొడుచుకునే టెన్షన్, తర్వాత ఏం జరుగబోతోందో అనే ఉత్సుకతను ఎక్కడా మిస్సవ్వకుండా తెరకెక్కించి కోదండరామి రెడ్డి శెభాష్ అనిపించుకున్నారు. రాళ్లపళ్లి క్యారెక్టర్ సినిమాకు కీలకం. సీనియర్ లాయర్ గా రావుగోపాల రావు తనదైన విలనిజాన్ని పోషించి ఆకట్టుకున్నారు. లాయర్ గా చిరంజీవి తనదైన నటనను ప్రదర్శించారు. ఇళయరాజా పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ‘యురేకా సకామికా..’ ‘సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది’, ‘బంతీ చామంతీ’ పాటలు అప్పట్లో చార్ట్ బస్టర్లని చెప్పాలి.

 

 

ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు కూడా చిరంజీవే. రాధిక కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమాల్లో అభిలాష కూడా ఒకటి. ‘యురేకా సకామికా’ పాటలో చిరంజీవి డ్యాన్స్ అద్భుతం. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెఎస్ రామారావు ఈ సినిమాను నిర్మించారు. తమిళ్ లో ఈ సినిమాను మోహన్ హీరోగా సత్తాతాయ్ తిరుంగళ్ గా రీమేక్ అయింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. చిరంజీవి కెరీర్లో చేసిన ఛాలెంజింగ్ పాత్రల్లో లాయర్ పాత్ర ఒకటనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: