పవన్ కళ్యాణ్ బన్నీకు చిన్న మామయ్య అవుతారు. అసలు మామయ చిరంజీవి అయితే ఆ వరసలో పవన్  చిన మామ అన్న మాట. మెగా కాంపౌండ్ హీరోల్లో చిరంజీవి తరువాత పేరు చెప్పాలంటే పవన్ పేరే ముందు చెబుతారు. అన్నకు వారసుడుగా పాతికేళ్ళ క్రితమే అరంగేట్రం చేసిన పవన్ అన్న  రేంజికి ఎదిగాడు. మెగా స్టార్ కి ధీటుగా పవర్ స్టార్ అనిపించుకున్నాడు. నిజానికి పవన్ కి సినిమాల మీద మోజు తక్కువ. లేకపోతే ఈ పాటికి తనకు ఉన్న ఇమేజ్ తో ఎక్కడికో వెళ్ళిపోయేవాడు.

 

ఇవన్నీ ఇలా ఉంటే తరువాత తరంలో మెగా కాంపౌండ్ లోకి ఎందరో హీరోలు వచ్చారు. ఇపుడు కనుక ఒక లెక్క వేసుకుంటే డజన్ మందికి తక్కువ ఉండరు. అయితే వీరంతా అటు చిరంజీవిని, ఇటు పవన్ని దేవుడిలాగే చూస్తారు. వారి మాటే తమ బాట అంటారు. 

 

ఇక అల్లు కుటుంబం నుంచి వారసుడిగా వచ్చిన బన్నీ కూడా మొదట్లో మెగా కాంపౌండ్ హీరోల లిస్ట్ లోనే ఉండేవారు. అయితే ఆయన తరువాత కాలంలో మాత్రం సెపరేట్ ట్రాక్ పట్టారు. తాను అల్లు రామలింగయ్య, అరవింద్ వారసుడినని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. తనకంటూ సొంత స్టైల్, మార్కెట్ ఉందని కూడా చెప్పుకునేందుకు ఆరాటపడుతున్నారు.

 

దాంతో అక్కడే పవన్ ఫ్యాన్స్ తో లడాయి వచ్చింది. అర్జున్ సినిమా ఫంక్షన్లలో మెగా ఫ్యాన్స్ ఈలలూ, గోలలూ మామూలే, అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం జై పవన్ అంటూ వచ్చి అల్లరి చేయడంతో ఒక సందర్భంలో నేను చెప్పను బ్రదర్ అనాల్సివచ్చింది బన్నీకి. దాంతో అక్కడ పెద్ద గ్యాప్ వచ్చేసింది. బన్నీ ఫ్యాన్స్ పవన్ ఫ్యాన్స్ వేరు అన్నట్లుగా చీలిక వచ్చేసింది.

 

అల వైకుంఠపురంతో సక్సెస్ ట్రాక్ పట్టిన బన్నీకి  అందులో సామజవరగమనా సాంగ్ పెద్ద హిట్. అలాగే బుట్ట బొమ్మ. రాములో రాముల సాంగ్స్  కూడా భారీ ఎత్తున  వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేశాయి. యూట్యూబ్ రికార్డులు కొల్లగొట్టాయి.

 

ఇపుడు పవన్ వంతు వచ్చింది. ఆయన లేటెస్టు  మూవీ వకీల్ సాబ్ లో మగువా మగువా సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారుట. బన్నీ అల సాంగ్స్ కంటే కూడా మా పవన్ సాంగ్ కి రికార్డులు బద్దలవుతున్నాయి అని  పోటీ పెట్టి మరీ యుధ్ధానికి రెడీ అవుతున్నారుట. దాంతో సోషల్ మీడియాలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్యన కొత్త వార్ స్టార్ట్ అయిపోయింది.

 


నిజానికి  చిన మామయ్యని బన్నీ బాగానే  రెస్పెక్ట్ చేస్తున్నాడు, ఆయనతొ మళ్ళీ రిలేషన్స్ కంటిన్యూ చేస్తూ ఏ రకమైన  గ్యాప్ లేకుండా చూసుకుంటున్నాడు. అయినా సరే ఈ రకమైన స్టార్ వార్ ఏంటని అటు బన్నీ ఫ్యాన్స్ కూడా అంటున్నారుట. మరి పవన్ ఫ్యాన్స్ ఊరుకోరుగా. వారికి పవనే దేవుడు. ఆయనతో ఒక్కసారి గ్యాప్ ఉన్నా లైఫ్ లాంగ్ చెప్పను బ్రదర్ అన్న మాటను  రిపీట్ చేస్తూనే ఉంటారంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: