చాలా వరకు తెలుగు సినిమా రంగాన్ని భ్రష్టు పట్టిస్తుంది తెలుగు ప్రొడ్యూసర్ లు అని చాలా మంది అంటుంటారు. హీరోలను మహానుభావులు గా భావించి వాళ్లకి రెమ్యునిరేషన్ లతో పాటు సినిమా లాభాల్లో కూడా వాటాలు ఇచ్చి అందనంత స్థాయిలో తెలుగు హీరోలను తెలుగు ప్రొడ్యూసర్ లే కూర్చోబెట్టారని చాలామంది చెబుతుంటారు. కేవలం తమ స్వలాభం కోసం కనీసం ప్రేక్షకులు గురించి కూడా ఆలోచించకుండా వ్యాపారం జరిగిపోవాలి అన్న ఉద్దేశంతో థియేటర్ టికెట్ విషయంలో అదే విధంగా జీఎస్టీ విషయంలో కనీసం ప్రేక్షకులు గురించి ఆలోచించకుండా రేట్లు పెంచుకుంటూ తెలుగు ప్రొడ్యూసర్లు పోతున్నారని విమర్శలు ఇటీవల గట్టిగా వినబడుతున్నాయి.

 

రెండు సంవత్సరాలలో దాదాపు టికెట్ రేట్లు ఊహించని విధంగా పెరిగిపోయాయని సినిమా హాల్ లోకి వెళ్ళాలి అన్న ఆడియన్స్ ఆలోచించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు అయితే మొదటిరోజు టికెట్ రేట్ చూస్తే షాక్ కొట్టే విధంగా ఉంటున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా రంగానికి ప్రభుత్వాలు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీ లో బ్లాక్ దొంగ దోపిడి బాగా జరుగుతుంది. అయితే ఇదే పరిస్థితి తమిళ సినిమా రంగంలో కూడా ఉండటంతో ఇప్పుడు తాజాగా డిస్ట్రిబ్యూషన్ సంఘాలు ప్రేక్షకుల పక్షాన నిలబడి శమర శంఖం పూరించాయి. ఈ నెల 27 నుంచి అక్కడ సినిమాలు విడుదల చేయమని తమిళ సినీ పంపిణీదారుల సంఘం సమాఖ్య నిర్ణయించింది. పంపిణీ దారుల ఆదాయంలో 10 శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని... సినిమా టిక్కెట్ పై 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని... దాంతో పాటు స్థానిక సంస్థల కోసం 8 శాతం ఎల్.బీ.టీ పన్ను కూడా అదనంగా బాదేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

ఇలా చేయడం వల్ల సినిమా ప్రేక్షకుల పై అధిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ  ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఆడియన్స్ సినిమా హాల్ కు రారని మేము కూడా వ్యాపారాలు మానుకోవాలి అంటూ ఇండస్ట్రీపై మండిపడ్డాయి. దీంతో తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ సంఘాలు చేస్తున్న విజ్ఞప్తి మేరకు, వాళ్లకు కష్టం రాకుండా తమిళ సినిమా నిర్మాణ మండలి ఆలోచనలో పడింది. దీంతో ఈ విషయంపై కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారు తమిళ వాళ్లను చూసి తెలుగు ప్రొడ్యూసర్లు ఇంకెప్పుడు నేర్చుకుంటారో అని వ్యాఖ్యానిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: