ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా డిస్ట్రిబ్యూటర్ గా వెలుగుతున్న దిల్ రాజు కు కొత్త సంవత్సరం బాగా కలిసొచ్చింది. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు కమర్షియల్ గా దిల్ రాజు ని ఒడ్డున పడేసింది. ఇక 'అల వైకుంఠపురములో' సినిమాను నైజాంలో పంపిణీ చేసి మంచి లాభాలందుకున్నారు. దాంతో మంచి ఫాం లో కి వచ్చిన మళ్ళీ గట్టి దెబ్బపడింది. అయితే దానికి కారణం ముమ్మాటికి దిల్ రాజు మాత్రమే. కోలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయడం ఆయన చేసిన మొదటి తప్పు. ఎందుకంటే ఆ కథ కంప్లీట్ గా కల్ట్ కంటెంట్. అదే తీసుకువచ్చి మోజు పడి మరీ జాను సినిమాగా నిర్మించారు. పోనీ ఎటూ సినిమా తీశాను కదా సక్రమంగా ప్రమోషన్స్ చేయలన్న ఆలోచన ఉండాలి కదా. సమంత ఉంది కదా అని సైలెంట్ గా ఉన్నారు. దాంతో రిజల్ట్ తేడా కొట్టింది. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. దీనిపై పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. 

 

ఐతే మార్చిలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించిన వి సినిమాతో నష్టాలు పూడ్చుకుందామననుకుంటే.. ఈ సినిమాకు గట్టి దెబ్బపడేలా ఉంది. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన వి సినిమా ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాలి. కానీ ఆ తేదీకి సినిమాను రిలీజ్ చేయాలా వద్దా అన్న డైలమాలో రాజు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్. ఇప్పటికే చాలా సినిమాల షూటింగ్స్ అర్ధాంతరంగా ఆగిపోయాయి.

 

అంతేకాదు ఈ కరోనా ఎఫెక్ట్ తోనే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు గడ్డుకాలం నడుస్తోంది. జనాలు థియేటర్ల వైపు రాక అసలు కలెక్షన్లే  లేవు. హైదరాబాద్ వంటి రద్దీ ఉన్న సిటీలలో జనాలు థియేటర్లకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ తో రానురాను పరిస్థితులు ఇంకా ఇబ్బందికరంగా మారనున్నాయి. ఒక వైపు ఎగ్జాంస్, మరో వైపు కరోనా ఎఫెక్ట్ తో జనాలు ఇప్పుడిప్పుడే థియేటర్లకు వచ్చేలా లేరు. హిట్ టాక్ తెచ్చుకున్న భీష్మ లాంటి సినిమా కూడా.. ఆశించినంతగా కలెక్షన్స్ రాక దిగాలు చెందారు. మరి ఇప్పుడు దిల్ రాజు సినిమాల పరిస్థితేంటో చూడాలి. చేయాల్సిన సినిమాలకి సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడంతో ఆ సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇప్పుడేమొ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఏదేమైనా దిల్ రాజు గతంలో లాగా తప్పులు చేయకుండా ఇకనుంచైనా ప్లాన్స్ పక్కాగా వేసుకుంటే బావుటుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: