టాలీవుడ్ లో ఈ బ్యూటి మొదటి సినిమాతోనే అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. మళయాలం లోనే కాదు తెలుగులో కూడా వరసగా హిట్స్ అందుకుంది. అంతేకాదు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు కమిటయింది. వాటిలో ఒక సినిమా బ్ల్లక్ బస్టర్. కాని టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదు. కానీ మీడియమ్ రేంజ్ హీరోలతో చాలా సినిమాల్లో నటించింది. అయితే ఎక్స్‌ఫోజింగ్ చేయకపోవడం ఆ తర్వాత కొన్ని వరస ఫ్లాపులతో ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. కానీ మలయాళ సినిమాలలో మాత్రం అవకాశాలు బాగానే ఉన్నాయి. అక్కడ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

 

ఇక సినిమా హీరోలతో లవ్ గట్రా ఎక్స్ట్రాలు లేవు గాని ఒక క్రికెటర్ తో రిలేషన్ మేయిన్‌టైన్ చేస్తుందని ఈ మధ్య బాగా టాక్ నడుస్తోంది. ఆ వార్తలను ఈమే ఖండించినప్పటికీ ముంబై మీడియాలో మాత్రం ఇద్దరి డేటింగ్ గురించి తరచూ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ బూరె బుగ్గల హీరోయిన్ కి ఒక కొత్త ఛాన్స్ వచ్చిందట. ఒక స్టార్ ప్రొడ్యూసర్ సోదరుడి కుమారుడి డెబ్యూ సినిమాలోనే ఈ ఆఫర్ దక్కిందట.

 

ఈ కొత్త జంట ఫ్రెండ్ షిప్ వెండితెరపైనే కాదని నిజ జీవితంలో కూడా స్నేహం చేస్తున్నారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇంకో వార్త ఏంటంటే అంతకముందు ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో బాగా షికార్లు చేసిందట. వరుసగా ఆఫర్స్ ఇవ్వడంతోనే ఆయనతో ఎక్కడికంటే అక్కడికి తిరిగి ఎంజాయ్ చేసిందట. దాంతో ఈ మ్యాటర్ కాస్త మీడియాకి తెలియడంతో ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఈ బ్యూటి ఇద్దరు జాగ్రత్త పడ్డారట. 

 

అంతేకాదు ఆయనతో అయితే అందరికీ తెలిసి హాట్ న్యూస్ అవుతుందని సీక్రెట్ గా ఆయన గారి సోదరుడి కొడుకుతో రహస్యంగా గడుపుతుందట. ఇదంతా కేవలం డబ్బు, సినిమాలలో అవకాశాల కోసమేనని చెప్పుకుంటున్నారు. ఈ బ్యూటీకి చేతిలో ఒక్క సినిమా తప్ప మరో ఆఫర్ లేదు. మరి ఈ సినిమాతో టాలీవుడ్ లో మరోసారి బిజీ అవుతుందా లేదా అన్నది ఆ సినిమా రిలీజ్ అయితే గాని తెలీదు. ఇక ఈ సీక్రెట్ రిలేషన్ కాస్త బెడిసికొట్టి ఏదైనా తేడా జరిగితే ఇక సినీ కెరీర్ మొత్తానికే క్లోజ్ అంటూ ఈవిడ గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: