ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఆందోళన నెలకొంది. హాలీవుడ్ లాంటి అంతర్జాతీయ మార్కెట్ కలిగిన సినిమాలు కరోనా వైరస్ వల్ల సినిమా రిలీజ్ లు పక్కన పెట్టడం జరిగింది. ఎక్కువగా జనాలు ఉండే చోట్ల ఈ వ్యాధి ప్రభావం ఉండటంతో ప్రపంచ దేశాలు ప్రభుత్వాలు జాగ్రత్తలు చెబుతున్నాయి. చాలావరకు జనాలు ఎక్కువగా ఉండే చోట్ల ఉండకూడదని, ఒకవేళ ఉండాల్సి వచ్చినా అని మొహానికి మాస్క్ కట్టుకొని బయటకు వెళ్లాలి కంటి వైద్య బృందాలు తెలుపుతున్నాయి. భారత్లో కూడా ఈ వ్యాధి ఎంట్రీ ఇవ్వటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ కరోనా వైరస్ వ్యాధి గుర్తించే ల్యాబ్ లు పెట్టడం జరిగింది. ఇటువంటి తరుణంలో భారత్ లో కూడా సినిమా మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది.

 

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ రావడంతో చాలా వరకు రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఇదే సమయంలో పరీక్షలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ముందుగా ఉగాది పండుగ నాడు రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ డైలమాలో పడ్డాయి. ఇటువంటి తరుణంలో నాచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ సినిమా రిలీజ్ చేయటానికి రెడీ అవుతున్న సందర్భంలో అభిమానులు వద్దంటున్నారు. అన్నా అసలే బయట మార్కెట్ లేదు దయచేసి ఈ సినిమాని "పోస్ట్ పోన్ చెయ్యి అన్నా" అంటూ బతిమిలాడుతున్నారు.

 

అంతే కాకుండా ఇదే సమయంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అసలే ఎగ్జామ్స్ టైమింగ్స్ మరోపక్క కరోనా భయం నెలకొంది ఇటువంటి టైం లో రిలీజ్ చేసిన మేము నష్టపోతాం అంటూ దిల్ రాజు ని వేడుకుంటున్నారు. మరోపక్క ఓవర్ సీస్ బయ్యర్ కూడా ఇప్పుడు వద్దంటున్నారు. అమెరికాలో కరోనా వ్యవహారం కాస్త గట్టిగానే వుంది. దీంతో నిర్మాత దిల్ రాజు ఈవారం చివరాఖరిన్నా సినిమా విడుదల తేదీ విషయంలో మరోసారి ఆలోచించే అవకాశం ఉంది అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: