తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలోనే డ్యాన్సులంటే మొట్టమొదటగా గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. డ్యాన్సుల్లో ఆయన చూపించిన ఇంపాక్ట్ అలాంటిది. ఆయన జనరేషన్ తర్వాత యంగ్ హీరోలందరూ డ్యాన్సులు బాగానే చేస్తున్నా వీరందరిలోకి బన్నీ డ్యాన్స్ వెరీ వెరీ స్పెషల్. డాడీ సినిమాలో చిన్న పాత్రతోనే డ్యాన్సుల్లో తన టాలెంట్ ను బయటపెట్టాడు. మామయ్యగా చిరంజీవి డ్యాన్సులు చూసి ఇన్ స్పైర్ అయిన బన్నీ తనదైనా డ్యాన్సింగ్ టాలెంట్ తో స్పెషల్ డ్యాన్సర్ అయ్యాడు.

IHG

 

గతంలో ప్రేక్షకులు డ్యాన్సుల కోసం ఎదురుచూసేది చిరంజీవి సినిమాకు మాత్రమే. ఇప్పుడలాంటి ఇంట్రస్ట్ నే బన్నీ సంపాదించాడు. మొదటి సినిమా నుంచే డ్యాన్సుల్లో తనకున్న ఇష్టాన్ని బయటపెట్టాడు. హీరోగా మారాక ప్రతి సినిమాలో చేసే డ్యాన్స్ మూమెంట్లు చాలా స్టైలిష్ గా ఉంటూంటాయి. ఫ్లోర్ డ్యాన్స్ వేసినా, బ్రేక్ డ్యాన్స్ వేసినా అది బన్నీ మార్క్ అండ్ స్టైల్ లో ఉంటాయి.  ఆర్య, ఆర్య2 సినిమాల్లో బన్నీ వేసిన స్టెప్ప్ ఎంత వెరైటీగా ఉంటాయో అంతే స్టైలిష్ గా ఉంటాయి. పాటకు తగ్గ సెట్లు, సెట్ కు తగ్గ డ్రెస్సింగ్, గూగుల్స్, అందుకు తగ్గ స్టెప్ప్ ఉండేలా చూసుకోవడంలో బన్నీ ఎక్స్ పర్ట్ అని చెప్పాలి.

IHG

 

రీసెంట్ బ్లాక్ బస్టర్ అల.. వైకుంఠపురములో సినిమాలో ‘బుట్ట బొమ్మా’ పాట ఎంత స్టైలిష్ గా ఉంటుందో క్యాస్టూమ్స్ , డ్యాన్స్ అంతే వెరైటీగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఈ పాట స్టెప్ప్ ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిన విషయమే. డ్యాన్సుల్లో తన సమకాలీకులైన ఎన్టీఆర్, రామ్ చరణ్ విజృంభిస్తున్నా అల్లు అర్జున్ తన డ్యాన్సింగ్ స్టైల్ తో ప్రత్యేకత చాటుకుంటున్నాడు. అందుకే బన్నీని స్టైలిష్ స్టార్ అంటారు ఫ్యాన్స్. అల.. వైకుంఠపురములో సినిమాలో అందరు హీరోల స్ఫూఫే ఇందుకు నిదర్శనం

మరింత సమాచారం తెలుసుకోండి: