మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్‌. ఓ సాధారణ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాప్‌ స్టార్స్‌ లో ఒకటిగా ఎదిగాడు బన్నీ. తన డ్యాన్స్‌ లు స్టైల్స్‌ తో అభిమానుల మనసు దోచుకున్న బన్నీ తన పరిదిని పెంచుకుంటూ వస్తున్నాడు. తెలుగులో సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ సాధించిన బన్నీ తరువాత తన మార్కెట్‌ను పెంచుకునే పనిలో పడ్డాడు. అందులో భాగంగా ఇతర భాషల మీద దృష్టి పెట్టాడు.

 

సాధారణంగా మెగా హీరోలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ సీమలోనూ మంచి మార్కెట్ ఉంది. మెగాస్టార్‌ చిరంజీవికి కన్నడలో భారీగా ఫ్యాన్స్‌ ఉండటంతో తరువాత మెగా హీరోలు అందరూ తమ సినిమాలో కర్ణాటకలోనూ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సాండల్‌ వుడ్‌లో డబ్బింగ్ సినిమాల మీద ఆంక్షలు ఉన్నా.. అక్కడ తెలుగు సినిమాలు కూడా బాగానే ఆడతాయి. అందుకే బన్నీ కన్నడలోనూ సత్తా చాటుతూ వస్తున్నాడు.

 

అయితే బన్నీ సొంతంగా మాలీవుడ్‌ లోనూ మార్కెట్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. బన్నీ స్టైల్‌ కు కేరళ ఆడియన్స్‌ కూడా ఫిదా అయిపోయారు. తొలిసారిగా 2006లో ఆర్య సినిమాను మలయాళంలో డబ్‌ చేశారు. ఆ సినిమా అక్కడ కూడా ఘనవిజయం సాదించటంతో తరువాత వరుసగా బన్నీ సినిమాలను మాలీవుడ్‌ లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఒక్కో సినిమాకు మాలీవుడ్‌లోనూ తన ఇమేజ్‌ పెంచుకుంటూ వస్తున్న బన్నీ ఇప్పుడు అక్కడ టాప్‌ స్టార్‌గా ఎదిగాడు. దాదాపు బన్నీ నటించిన అన్ని సినిమాలు మాలీవుడ్‌ లో రిలీజ్‌ అయ్యాయి. మలయాళ స్టార్ హీరోలకు పోటిగా ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీ, మాలీవుడ్‌లో జెండా పాతిన తొలి తెలుగు హీరోగా రికార్డ్ సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: