మెగా ఫ్యామిలీ లో ఏ హీరో వచ్చినా సరే ఆ ఫ్యామిలీ నీడలోనే పైకి వస్తారు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ లో వచ్చే ప్రతీ హీరోకి ఆ ఫ్యామిలీ గుర్తింపు మాత్రమే బ్రాండ్ అని అది పవన్ కళ్యాణ్ అయినా రామ్ చరణ్ అయినా మరొకరు అయినా సరే ఇలా వచ్చిన వాళ్ళే అంటూ ఉంటారు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ విషయానికి వస్తే అది కాస్త భిన్నంగా ఉంటుంది. తనకు ఆ నీడ అవసరం లేదని అంటున్నాడు. తన కెరీర్ కి ఎప్పుడూ మెగా ఫ్యామిలీ అవసరం లేదని, ఇప్పుడు కూడా తనకు అవసరం లేదని అంటున్నాడు. 

 

తన తండ్రి మెగా ఫ్యామిలీ నీడలో పైకి రాలేదని, తమకు తన తాత అల్లు రామలింగయ్య ద్వారా వచ్చిన పేరు ఉంది అది చాలని మెగా ఫ్యామిలీ కంటే ముందే అల్లు రామలింగయ్య వచ్చారని, ఆయన నీడలో మెగా ఫ్యామిలీ పైకి వచ్చింది గాని మరొకటి కాదని అతను భావిస్తాడట. అందుకే ఇతను మెగా ఫ్యామిలీ హీరోలతో కలిసి సినిమాలు చెయ్యాలన్నా సరే అంతగా ఆసక్తి చూపించే వాడు కాదని అంటున్నారు. సాధారణంగా అల్లు అర్జున్ చాలా మంది హిట్ దర్శకులతో సినిమాలు చేసాడు. అందులో అగ్ర దర్శకులు కూడా ఉన్నారు. 

 

తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అతని మీద కోపం తో మెగా ఫాన్స్ కూడా అతని సినిమాలు తక్కువగా చూస్తారని అతను భావిస్తూ ఉంటాడు. వాస్తవం కూడా ఇదే అనేది సినీ జనాల మాట. అతనితో సినిమాలు చేయడానికి అగ్ర దర్శకులు అందరూ పోటీ పడుతూ ఉంటారు. అందుకే తనకు ఏ ఫ్యామిలీ నీడ వద్దని తన తండ్రి పలుకుబడి తనకు చాలని బన్నీ భావిస్తాడట. అందుకే అతని సినిమా కార్యక్రమాలకు కూడా పెద్దగా మెగా హీరోలను పిలవడు.

మరింత సమాచారం తెలుసుకోండి: