సాధారణంగా ఫాన్స్ నందు మెగా ఫాన్స్ కాస్త వేరుగా ఉంటారు. వాళ్లకు చిరంజీవి దైవం... చిరంజీవి ఎం చేసినా సరే ఫాన్స్ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీని ప్రజలు పెద్దగా ఆదరించకపోయినా మెగా అభిమానులు మాత్రం నెత్తిన పెట్టుకుని మోశారు. ఇకపోతే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతీ హీరో ని ఆదరించారు. చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా లేకుండా మెగా హీరోల సినిమాలు అన్నీ చూసారు ఫాన్స్. దీనితోనే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతీ హీరో ఇప్పుడు సినిమాల్లో దూసుకుపోతున్నాడు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. 

 

అయితే ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందరు హీరోలకు మెగా ఫాన్స్ అవసరం గాని తనకు మాత్రం అవసరం లేదనే భావనలో ఉంటాడట అల్లు అర్జున్. కెరీర్ మొదట్లో అల్లు అర్జున్ సినిమాలను మెగా ఫాన్స్ చూసారు. ఆ తర్వాత సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ అన్నయ్య తోనే ఎదిగారు అనే భావనలో ఉంటారని కాని తాను మాత్రం అలా కాదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. సాధారణంగా ఏ హీరో అయినా మెగా ఫాన్స్ ని దగ్గర చేసుకోవడానికి చూస్తాడు అనేది అర్ధమవుతు ఉంటుంది. కాని అల్లు అర్జున్ అలా కాదు. 

 

వాళ్ళ మీద విమర్శలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. తనకు ఆ ఫాన్స్ అవసరం లేదని తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉందని, తన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తారని, అందరికి తన సినిమాలు నచ్చుతాయని ఆలోచించే బన్నీ మెగా ఫాన్స్ ని దగ్గర చేసుకోవడానికి అంతగా ఇష్టపడటం లేదు. అందుకే మెగా ఫాన్స్ కూడా అతని సినిమాలను దాదాపుగా లైట్ తీసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: