స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి నుండి కూడ ఎన్నో వాటిని బ్యాలన్స్ చేసుకుంటూ వచ్చాడు. సినిమా సినిమాకి ఓ కొత్త రూపాన్ని ప్రేక్షకుల ముందుకి తేస్తూ ఎంతో దగ్గరైపోయాడు మన టాలివుడ్ స్టైలిష్  స్టార్. అల్లు అర్జున్ మంచి నటుడు. గంగోత్రి సినిమా నుండి హీరోగా నటించడం ప్రారంభం చేసాడు. అంతే కాకుండా వివిధ పాత్రలతో ఎంత గానో మెప్పించి సుస్థిర స్థానం సంపాదించాడు. అలానే ఈ నటుడు మంచి నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. నటుడిగా మన అందరికీ తెలిసిన అల్లు అర్జున్  మంచి డాన్స్తో తన కుటుంబ ఫంక్షన్స్ లో ఎంతగానో అలరిస్తాడుట.

 

బాల నటుడిగా కూడ నటించాడు బన్ని. మొదట తను విజేత సినిమా ష్యూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ చిత్రంలో ఒక చిన్న పిల్లవాడి పాత్రలో నటించాడు. ఇలా బన్నీ బాల నటుడిగా నటించాడు. తర్వాత స్వాతి ముత్యం సినిమాలో కూడ అల్లు అర్జున్ చిన్న పాత్ర చేసాడు. అల్లు అర్జున్ ఆ తర్వాత డాడి సినిమాలో డాన్స్తో కనిపించి ఎంతగానో మెప్పించాడు.

 


గంగోత్రి, ఆర్య, బన్ని, హ్యాపి, దేశముదురు, శంకర్ దాదా జిందాబాద్, పరుగు, ఆర్య2, వరుడు, వేదం, బద్రీనాధ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, ఎవడు, సన్నఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాదం,  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అల వైకుంఠపురములో. ఇలా బన్నీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చాడు. 

 


మంచి సినిమా కధలతో. ఎవ్వరూ చెయ్యలేనంత డాన్స్తో, తనదైన స్టైల్తో ప్రేక్షకులకి దగ్గరయ్యాడు అల్లు అర్జున్. ఇలా అల్లు అర్జున్ గంగోత్రి సినిమా నుండి కూడ ఎంతో చక్కగా తన ట్యాలంట్ని పెంచుకుంటూ వస్తున్న ఆ ఎదుగుదల కనిపిస్తున్నదే. ఇలా బన్నీ వివిధ పాత్రలతో ఎంతగానో మెప్పిస్తూ రాణిస్తున్నాడు ఈ స్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి: