ప్రస్తుతం అన్ని భాషల్లో పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. బాహుబలి సినిమా ఘన విజయం సాధించటంతో భారీ బడ్జెట్‌ సినిమాలన్నింటిని పాన్‌ ఇండియా లెవల్‌ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు రీజినల్‌ సినిమాల దర్శక నిర్మాతలు. కే జీ ఎఫ్‌  సినిమా సక్సెస్ తో కమర్షియల్‌ సినిమాలు కూడా పాన్‌ ఇండియా లెవ్‌ లో సత్తా చాటుతాయని ప్రూవ్‌ కావటంతో కమర్షియల్‌ స్టార్స్‌ అందరూ తమ సినిమాలను పాన్‌ ఇండియా లెవల్‌ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

ఇప్పటికే తెలుగు నుంచి ప్రభాస్‌, మెగాస్టార్‌ చిరంజీవిల సినిమాలు పాన్‌ ఇండియా లెవల్‌ లో రిలీజ్ అయ్యాయి. బాహుబలి, సాహో లతో ప్రభాస్‌ నేషనల్‌ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. తరువాత చిరంజీవి కూడి సైరా నరసింహా రెడ్డి సినిమాలో జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ప్రయత్నించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో వర్క్‌ అవుట్‌ కాలేదు. కానీ నష్టాలు రాకపోవటంతో మరింత మంది స్టార్ హీరోలు పాన్‌ ఇండియా సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు.

 

ఈ లిస్ట్ చేరేందుకు బన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఇన్నాళ్లు సౌత్‌ మార్కెట్ మీద మాత్రమే కాన్సన్‌ ట్రేట్‌ చేసిన బన్నీ త్వరలో బాలీవుడ్‌ లోనూ సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఇప్పటికే మలయాళ మార్కెట్‌లో జెండా పాతిన బన్నీ త్వరలోనే బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తానంటూ ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. అల వైకుంఠపురములో సినిమా సక్సెస్‌ తరువాత స్పెషల్‌ గా బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన బన్నీ ఇప్పటి నుంచి బాలీవుడ్‌ లో  సత్తా చాటేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సుకుమార్‌ సినిమా నే పాన్‌ ఇండియా లెవల్‌ లో రూపొందిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: