స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇతను అందరిలా కాదు.. ఇతను ఒక ప్రత్యేక హీరో. అందరి హీరోలా కాకుండా అతను సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూనే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇంకా అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ఇరు వర్గాల పెద్దల ఆశీర్వాదంతో 2011 మర్చి 6వ తేదీన ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

 

అయితే వీరి ఇద్దరికీ ప్రేమకు ప్రతి రూపంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వల్లే అల్లు అయాన్.. అర్హ. ఇప్పటికి 9 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట టాలీవుడ్ లోనే క్రేజీ కపుల్ అంటే నమ్మండి. అయితే ఇంతమంచి కపుల్ అసలు ఎలా కలుసుకున్నారు? ఎలా లవ్ లో పడ్డారు? పెద్దలను ఎలా ఒప్పించారు అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

అల్లు అర్జున్ కి తన స్నేహితుల ద్వారా స్నేహ పరిచయం అయ్యిందట.. ఆ తర్వాత అల్లు అర్జున్ ఆమెకు ప్రేపోజ్ చెయ్యగా మొదట రిజెక్ట్ చేసిందట.. ఆతరవాత మళ్లీ తానే ఆమె ప్రేమ పడిందట.. అయితే అల్లు అర్జున్ చదువు మొదట వాళ్ళ ప్రేమకు అడ్డంకి మారిందట.. కారణం అల్లు అర్జున్ కేవలం 10వ తరగతి వరుకు మాత్రమే చదివాడు అయితే స్నేహ రెడ్డి మాత్రం అమెరికాలో ఎంఎస్ చేసి వచ్చిందట. దీని వల్ల వాళ్ళ ప్రేమ పెళ్లికి కాస్త బ్రేకులు పడ్డాయని అప్పట్లో ఓ ఛానెల్ ఫేక్ వార్తలను ప్రసారం చేసింది.

 

అయితే అది ఏమి లేదు అని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్నేహ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించాడట..  ఆలా ఎన్నో మలుపులు తిరిగి అల్లు అర్జున్ ప్రేమ కథ సుకాంతం అయ్యిందట. అప్పట్లో అల్లు అర్జున్ ప్రేమ పెళ్లి ఒక సంచలనం అయ్యిందట. అలా అయినా పెళ్లి ప్రస్తుతం టాలీవుడ్ స్వీట్ కపుల్ ఇది. 

మరింత సమాచారం తెలుసుకోండి: