స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు గంగోత్రి సినిమా తో పరిచయమైన అల్లు అర్జున్ ఆ తర్వాత ఎదుగుతూ తెలుగు ప్రేక్షకులందరికీ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో  మంది హీరోలు ఉన్న అల్లు అర్జున్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అల్లు అర్జున్ డాన్స్.. అల్లు అర్జున్ యాక్షన్.. అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ఇలా అల్లు అర్జున్ ప్రతి విషయంలో యూత్ ని  ఆకర్షిస్తూనే ఉంటాడు. ఇక అల్లు అర్జున్ డాన్స్ కి ఫిదా అవ్వని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. 

 

 

 అయితే ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ ఎన్నో  సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నట్లే కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయాలను సాధించిన సినిమాలు కొన్ని అయితే.. ఎన్నో అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బోల్తాపడిన సినిమాలు కొన్ని . ఇలా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బోల్తాపడిన సినిమాల్లో  ముందు వరుసలో ఉండే సినిమా నా పేరు సూర్య. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ నా పేరు సూర్య అని ఉండగా సబ్ టైటిల్ నా ఇల్లు ఇండియా అని ఉంది. 

 

 

 వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం అల్లుఅర్జున్ ఎంతగానో కష్టపడ్డాడు. ముఖ్యంగా బాడిని ఆర్మీ ఆఫీసర్ లాగా తయారు చేసి భారీకాయం గా మారిపోయాడు. ఇక హెయిర్ స్టైల్ విషయంలో కూడా ఎంతగానో మార్పులు చేసాడు. పూర్తిగా తన లుక్ మొత్తం మార్చుకున్నాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ గెటప్ కూడా చాలా కొత్తగా కనిపించడం తో.. ప్రేక్షకుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక మొదటి సారి అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది ఈ సినిమా. దీంతో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. దీంతో ఈ సినిమాను ఎక్కువ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ చాలానే నష్టపోయారు. దీంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు అప్పట్లో ఎన్నో గొడవలు కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: