అల్లు అర్జున్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన అల్లు అర్జున్ ఈ మధ్యే ఓ షార్ట్ ఫిలిం కూడా తీశాడు. అప్పట్లో ఈ షార్ట్ ఫిలిం ఒక సంచలనం అంటే నమ్మండి. ఎందుకు సంచలనం అని సందేహం రావచ్చు.. అయన తీసిన షార్ట్ ఫిలిం అలాంటిది. 

 

ఎన్నోరకాల అవగాహనాను ప్రజలకు కల్పించారు.. ఆ వీడియోను అల్లు అర్జున్ నిమించగా సుకుమార్ దర్శకత్వం వహించారు. ఆ షార్ట్ ఫిలిం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. ''ఐ యామ్ దట్ చేంజ్''. ఆ షార్ట్ ఫిలిం యూత్ ను ఎంతో ఆకట్టుకుంది. డ్రంకన్ డ్రైవ్‌, సెల్‌ఫోన డ్రైవింగ్‌, సీట్‌బెల్ట్‌, హెల్మెట్‌ లేకుండా, రాంగ్‌ రూట్లో వాహనం నడుపుట... తదితర అంశాలపై ఆ షార్ట్ ఫిలిం లో అవగాహనా కల్పించారు. 

 

అసలు ఆ షార్ట్ ఫిలిం కథనం ఏంటి అంటే?.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఓ వ్యక్తి కారును నడుపుతాడు. అయితే అది గమనించి ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ వాహనాన్ని ఆపేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి అతనికి డబ్బులు ఇస్తూ అలాగే ఫోన్ మాట్లాడుతాడు.. అయితే కానిస్టేబుల్‌ డబ్బు తీసుకోకుండా రశీదు ముఖాన కొడుతాడు.. 

 

అనంతరం అల్లు అర్జున్ ఓ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ భద్రత సిబ్బంది అందరినీ తనిఖీ చేస్తుంటాడు. హీరో వచ్చేసరికి పక్క నుంచే వెళ్లే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. ఆ సమయంలో హీరో ఓ క్షణం ఆలోచించి తిరిగి తనిఖీ ద్వారం గుండా వెళ్తాడు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఉద్యేశం. ఈ షార్ట్ ఫిలింను 2014 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. అప్పట్లో ఈ సూపర్ హిట్ షార్ట్ ఫిలిం.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: