మెగాస్టార్‌ చిరంజీవి నట వారసుడిగా.. మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు అల్లు అర్జున్‌. గంగోత్రి సినిమాతో గ్రాండ్‌ గా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌ తొలి సినిమా తోనూ తానేంటో నిరూపించుకున్నాడు. తరువాత వరుసగా ఒక్కో సినిమాకు తన ఇమేజ్‌ ను పెంచుకుంటూ వస్తూ ఇప్పుడు స్టైలిష్ స్టార్‌ గా తిరుగులేని స్టార్ ఇమేజ్‌ ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ లో ఒకడిగా నిలిచాడు అల్లు అర్జున్‌.

 

అయితే సినిమాల్లోకి రాకముందు బన్నీ ఏం చేసేవాడు. అసలు చిన్న తనం నుంచే బన్నీ హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడా..? అన్న అనుమానాలు చాలా మంది అభిమానుల్లో ఉన్నాయి. మెగా ఫ్యామిలీ మెంబర్‌ కావటంతో చిన్న తనం నుంచే సినీ రంగానికి దగ్గరగా పెరిగాడు. దీంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించాడు. అయితే తరువాత రెగ్యులర్‌ స్టడీస్‌లో భాగంగా ఇండస్ట్రీకి దూరమైన బన్నీ, తిరిగి ఫీల్డ్‌ లోకి ఎంటర్‌ అయ్యేందుకు గ్రాఫిక్స్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఓ ప్రముఖ సంస్థలో గ్రాఫిక్‌ డిజైనింగ్‌ కోర్స్‌ కూడా చేశాడు.

 

అయితే గ్రాఫిక్స్ నేర్చుకున్నా బన్నీ, నటుడిగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా సక్సెస్‌ కావటంత గ్రాఫిక్స్‌ ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఒక్కో సినిమాతో నటుడిగా పరిణతి చెందుతూ వస్తున్న బన్నీ ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌గా ఉన్నాడు. హీరోగానే కాదు పలు వ్యాపారల్లోనూ అడుగుపెట్టి సత్తా చాటుతున్నాడు. త్వరలో నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో బన్నీ ఉన్నాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాలో ఇండస్ట్రీ హిట్ సాధించిన బన్నీ త్వరలో పాన్‌ ఇండియా స్టార్ గా ఎదగాలని ప్లాన్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: