ఎనర్జిటిక్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల్లో డాన్స్ చేయడానికి ఎంత కష్టపడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ అల వైకుంఠపురములో అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్ స్టెప్స్ కి ఫిదా అయ్యానని సాక్షాత్తు తానే మీడియా సమావేశంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కేవలం టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాదు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు కూడా అల్లు అర్జున్ డాన్స్ కి ఫిదా అయిపోతారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల బాలీవుడ్ లో మైకేల్ జాక్సన్ గా పిలుచుకునే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.




నిజానికి హృతిక్ రోషన్ మిల్లి సెకన్లలోనే మెరుపుతీగలా గా కష్టమైన డ్యాన్స్ మూవ్స్ నైనా అలవోకగా చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటాడు. ప్రభుదేవా లాంటి భారతదేశ గొప్ప డాన్సర్ లే హృతిక్ రోషన్ డాన్స్ టాలెంట్ కు అభిమానులు అయిపోయారు. మరి అంత గొప్ప డాన్సర్ హృతిక్ రోషన్ మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మంచి మాట్లాడటం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు.




హృతిక్ రోషన్ మాట్లాడుతూ... నాకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం తను నాకంటే బాగా డాన్స్ చేయగలడు. అతని ఎనర్జీ కి ఫిదా అయిపోయాను. అతను ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండడానికి ఏం తింటారో నాకు తెలుసుకోవాలని ఉంది అంటూ ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఈ ఆర్య 2 హీరోని తెగ కొనియాడాడు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ స్క్రిప్ట్ ల కంటే ఎక్కువ పాటలు, డాన్స్ ల మీద ఎక్కువ శ్రద్ధ చెప్తాడు. అతనికి ఏ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలో తెలిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒంటిచేత్తో దాదాపు పది సంవత్సరాల పాటు రాణిస్తాడని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: