అల్లు అర్జున్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది తన స్టైల్ అలాగే డాన్స్.. ఇప్పటి యూత్ హీరోల్లో బాగా డాన్స్ చేసే హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. స్టైలిష్ స్టార్ గా తనదైన నటనతో దూసుకుపోతున్నాడు. మెగాస్టార్, పవర్ స్టార్ లకు అల్లుడు, గొప్ప నిర్మాత అల్లు అరవింద్ కొడుకు, అల్లు రామలింగయ్య మనవడు అయినాగానీ ఎప్పుడు వల్ల పేర్లు వాడుకోలేదు.

 

తన నటనతో, అభినయంతో, స్టైల్ తో డాన్సులతో అందరిని ఆకర్షించి మెప్పించాడు. ఇప్పుడు యూత్ హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ మొదట హీరోగా నటించిన సినిమా గంగోత్రి. అంతకముందు మావయ్య చిరంజీవి తో డాడీ సినిమాల్లో అతిధి పాత్రలో నటించాడు.

 

అయితే అల్లు అర్జున్ మాత్రం తన చిన్నప్పటి నుంచి నిలకడ లేని ఆలోచనలతో ఉండేవాడట. ఏటు వైపు జీవితంలో సెటల్ అవ్వాలనే తిక మకలో ఉండేవాడట. అల్లు అర్జున్, కెరీర్ పరంగా రకరకాలుగా ఆలోచించాడట.

మొదట్లో అల్లు అర్జున్ మ్యూజికల్ గా పియానో టీచర్ అవుదామని అనుకున్నాడట. కానీ కుదరలేదు. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్ టీచర్ అవుదామని అనుకున్నాడట. తర్వాత యానిమేటర్ గానో, విజువల్ ఎఫక్ట్స్ సూపర్ వైజర్ గానో అవుదామని అనుకున్నాడట.

 

చివరకు నాసాలో సైంటిస్ట్ గా మారాలని అనుకున్నాడట. ఇలా రకరకాల ఆలోచనలు చేసిన అల్లు అర్జున్ చివరకు సినిమాల్లోనే స్థిరపడిపోయాడు. 18 సంవత్సరాల వయస్సులో మాత్రం హీరోగా మారి సక్సెస్ అవ్వాలని కలలు కన్నాడట. కన్న కాలం నెరవేరింది. కొన్ని కోట్ల మంది అభిమానుల మనసుని గెలుచుకున్నాడు. చిన్నప్పటి నుండి డాన్స్ అంటే చాలా ఇష్టంతో నేర్చుకున్నాడంట. ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ అయిన గాని డాన్సులో ముందుంటాడట.

 

అల్లరి విషయంలో కూడా ముందేనట. ప్రస్తుతం అల్లు అర్జున్ అలా వైకుంఠ పురంలో సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. సినిమా మంచి విజయాన్ని సాధించి అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దేవుడి రాతే వేరు మానమొకటి అనుకుంటే దేవుడు ఇంకోటి రాస్తాడు. అల్లు అర్జున్ కుడా అంతే ఎదో అవ్వాలనుకుని చివరికి హీరో అయ్యాడు. కొన్ని కోట్ల మనస్సులో స్థానం సంపాదించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: