టాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. స్టైలిష్ స్టార్ గా అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. అతను చేసిన మొదటి సినిమా గంగోత్రి రెండో సినిమాకు చాలా తేడాలు ఉన్నాయి. అతని సినిమాలు అనగానే ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో కూడా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది పక్కన పెడితే అతను పెళ్ళికి ముందు ఒకలా కనిపించాడు పెళ్లి తర్వాత మరోలా కనిపించాడు. 

 

స్నేహా రెడ్డి తో పెళ్లి అయిన తర్వాత అల్లు అర్జున్ ఆహార్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పటి వరకు అతను స్టైల్ ఎక్కువగా ఫాలో అయి మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యే వాడు. కాని పెళ్లి తర్వాత అతని లుక్ అందరికి నచ్చింది. అల్లు అర్జున్ చేసే సినిమాలు, అతని ప్రచార వ్యవహారాలూ అన్నీ కూడా స్నేహా రెడ్డి దగ్గర ఉండి చూసుకుంటాడు. స్నేహా విషయంలో అల్లు అర్జున్ కూడా అదే విధంగా ఉంటాడు. ఆమెకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. మాస్ లుక్ నుంచి క్లాస్ లుక్ కి అతన్ని మార్చారు స్నేహా రెడ్డి. ఈ విషయం బన్నీ ఫాన్స్ కూడా అంగీకరిస్తూ ఉంటారు. 

 

టాలీవుడ్ లో ఇప్పుడు అతను అగ్ర హీరోగా ఉన్నాడు. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా స్నేహా సలహాలు ఉన్నాయని అంటూ ఉంటారు అతని అభిమానులు. ప్రతీ చిన్న విషయం కూడా స్నేహ పట్టించుకుంటూ అతని కెరీర్ ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ తో సినిమా సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: