కొన్నాళ్ల క్రితం కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రస్ గా మారాడు అల్లు అర్జున్. మెగా హీరోగా ముద్ర పడ్డ బన్నీ మొదటి నుంచీ చిరంజీవిపవన్ కల్యాణ్ ను భుజం మీద మోశాడు. కానీ.. విజయవాడలో జరిగిన సరైనోడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ గురించి చెప్పాలని కోరగా ‘చెప్పను బ్రదర్’ అంటూ పెద్ద సంచలనానికి తెర తీశాడు. అప్పటి నుంచి బన్నీ పవన్ ఫ్యాన్స్ కు టార్గెట్ అయి వార్తల్లో నిలిచాడు.

IHG

 

ఒకప్పుడు ‘చిరంజీవి గారు ఇచ్చిన ఫ్యాన్ బేస్ ను, క్రేజ్ ను మరింత బూస్టప్ ఇచ్చి మాకు దారి పరిచింది పవన్ కల్యాణ్ గారు’ అన్న బన్నీనే పవన్ గురించి చెప్పను బ్రదర్ అనటం పెద్ద సంచలనానికి దారి తీసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ బన్నీ సినిమాలను టార్గెట్ చేశారు. ఆ ఎఫెక్ట్ దువ్వాడ జగన్నాధం సినిమాపై బాగా పడింది. సినిమాల్లో ఈ డైలాగ్ కూడా పాపులర్ అయిపోయింది. ప్రజారాజ్యం సమయంలో జరిగిన రాజకీయాలు, జనసేన ఆవిర్భావం తర్వాత అల్లు అరవింద్ పై చేసిన కొన్ని కామెంట్ల వల్ల బన్నీ హర్ట్ అయి ఉంటాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

IHG

 

తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ.. శ్రీరెడ్డి విషయంలో పవన్ కల్యాణ్ ఫిలింనగర్ చాంబర్ కి రావడంతో అక్కడ బన్నీ ప్రత్యక్షమై పవన్ కు సపోర్ట్ గా నిలవడం మళ్లీ చర్చనీయాంశమైంది. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో పవన్ కు సపోర్ట్ గా ఎన్నికల ప్రచారంలో నిలవడంతో పవన్ ఫ్యాన్స్ కొంచెం చల్లబడ్డారు. అల.. వైకుంఠపురములో హిట్ అయిన సందర్భంగా బన్నీకి పవన్ బొకే పంపించడంతో అంతా కామ్ అయిపోయారు. ఇలా బన్నీ పనులకు కారణాలు తెలీకపోయినా మెగా, అల్లు అభిమానులు ‘మెగా’ ఫ్యాన్స్ గా మారిపోయారనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: