తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అల్లు అర్జున్ స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో విభిన్నమైన గెటప్ తో కనిపిస్తూ సరికొత్త హెయిర్ స్టైల్ తో యూత్ ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాడు. కేవలం హెయిర్ స్టైల్ ద్వారానే కాకుండా అల్లు అర్జున్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎంతోమందిని  ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ప్రతి సినిమాలో అల్లు అర్జున్ వాడే హెయిర్ స్టైల్ యూత్ ని బాగా ఆకర్షించిన తో పాటు అదే ట్రెండ్ గా మారిపోతుంది. ఇప్పటివరకు అల్లుఅర్జున్ చాలా సినిమాల్లో ఎన్నో హెయిర్ స్టైల్స్ వాడాడు. ఇక అల్లు అర్జున్ సినిమాలో హెయిర్ స్టైల్ చూసి యూత్ కూడా ఎంతో మంది అదే హెయిర్ స్టైల్ తో దర్శనం ఇచ్చారు కూడా. ఇక మొన్నటికి మొన్న అలా వైకుంఠపురములో సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు సార్ హీరో అల్లు అర్జున్. 

 

 

 తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అల్లు అర్జున్ కి స్టైల్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులందరూ అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా పిలుచుకుంటారు. ఇక మొన్నటికి మొన్న అల వైకుంఠ పురములో కూడా సరికొత్త హెయిర్ స్టైల్ తో కొత్త ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో వాడిన హెయిర్ స్టైల్ ఏ ఉపయోగిస్తున్నారు. మామూలుగానే గెటప్ పరంగా ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అల్లు అర్జున్. దేశముదురు లో లాంగ్ హెయిర్ తో సిక్స్ ప్యాక్ తో  మెస్మరైజ్ చేయాలన్న... నా పేరు సూర్య లో తన బాడీ లాంగ్వేజ్ మార్చుకొని అంచనాలు పెంచేయాలన్నా.. అది ఒక అల్లు అర్జున్ కే సాధ్యం అని చెప్పాలి. 

 

 

 అందుకే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఏదైనా సినిమా తెరకెక్కుతుంది అంటే అందులో ఏదో కొత్త స్టైల్ తో  కనిపించబోతున్నారని అభిమానులు అనుకుంటారు. అయితే తాజాగా బన్నీ ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్  అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ సైన్ చేశాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ఎప్పుడూ కనిపించే యంగ్ ఎనర్జిటిక్ పాత్ర కాగా... మరొక పాత్రలో మధ్య వయస్కుడు గా కనిపించబోతున్నాడట అల్లు అర్జున్. 

 

అయితే మధ్య వయస్కుడు పాత్ర కోసం అల్లు అర్జున్ విగ్ ధరించనున్నాడట. అయితే ఇన్నేళ్ల కెరీర్లో ఇప్పటి వరకు విగ్ ధరించని అల్లు అర్జున్... తొలిసారి ఐకాన్  చిత్రంలో బిగ్ ధరించి పోతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: