అల్లుఅర్జున్, స్నేహ‌ల‌తారెడ్డి వీరిద్ద‌రూ కూడా ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. నిజానికి బ‌న్నీకి స్నేహ‌ల‌తారెడ్డిని ఓ హీరోయిన్‌లా ఫీల‌వుతారు. అలా ఫీల‌వ్వ‌డం కూడా ఏమాత్రం త‌ప్పుకాదు అనిపిస్త‌ది. ఎందుకంటే స్నేహ‌లతారెడ్డి అంత అందంగా ఉంటుంది. ఇక స్నేహ‌కి సినిమాలంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఫేమ‌స్ బిజినెస్ మ్యాన్ శేఖ‌ర్‌రెడ్డి కుమార్తు స్నేహ‌ల‌తారెడ్డి. అమెరికాలో ఎం.ఎస్ చేసి వ‌చ్చింది. స్నేహారెడ్డి ఓ ఫ్రండ్ పెళ్ళిలో అల్లుఅర్జున్ చూశారు. అక్క‌డే మొద‌టి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అక్క‌డే ఈ ల‌వ్‌స్టోరీ స్టార్ట్ అయింది. అమ్మాయిల‌ను ప‌డేయ‌డంలో దేశ‌ముద‌ర‌యిన ఇక ఆ ప‌రిచ‌యానికి ఫుల్ స్టాప్ అంటూ ఉంటుందా. ఇక వీరి ప‌రిచ‌యంలో చాలా కొద్ది కాలంలోనే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అస‌లే రేసుగుర్రం క‌దా బాగా స్పీడ్‌తోనే త‌న ల‌వ్‌ని ప్ర‌పోజ్ చేశాడ‌ట‌.ఇక అక్క‌డే అస‌లు క‌థంతా మొద‌ల‌యింది. రీల్ లైఫ్‌లో చూస్తున్న‌ట్లుగానే రియ‌ల్ లైఫ్‌లో కూడా అంద‌రిలాగే వీళ్ళ‌పేరెంట్స్ వీళ్ళ వివాహానికి వెంట‌నే ఓకే చెప్ప‌లేదు. వీళ్ళ‌దేమో సినిమా ఫ్యామిలీ, వాళ్ళ‌దేమో బిజినెస్ ఫ్యామిలీ ఇక ఇవి రెండు కుటుంబాలు క‌లుస్తాయా అని మొద‌ట్లో కాస్త ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

 

కొన్ని రోజుల త‌ర్వాత ఒప్పుకున్నారు. కానీపెళ్ళికాక‌ముందు వీరిద్ద‌రి గురించి ఎక్క‌డా కూడా వార్త‌ల్లో లేరు. అయితే వీరిద్ద‌రి ల‌వ్‌స్టోరీ పై సినిమా కూడా వ‌స్తుంద‌ని అప్ప‌ట్లో కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు ఒక‌బాబు, పాప‌కి పేరెంట్స్ అయ్యారు. వీళ్ళ పిల్ల‌లే ఇప్పుడు ఆ రెండు ఫ్యామిలీల‌కి ప్ర‌పంచ‌మ‌య్యారు. పిల్ల‌లు పుట్టాక బ‌న్నీకి బాగా క‌లిసొచ్చింది అని ఒక‌సారి చెప్పాడు. అంతేకాకుండా ఈ రేసుగుర్రంతో స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి, స‌రైనోడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు హిట్ అందుకున్నాడు. బ‌న్నీకి బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొత్తేమికాక‌పోయినా అయాన్‌తోపాటు వ‌చ్చిన ఈ హిట్ల‌కి తెగ మురిసిపోయాడు. స్టార్‌హీరో, అమ్మాయిల్లో ఎంతో క్రేజ్ ఉంది. కావాలంటే సినిమా హీరోయిన్ల‌నే పెళ్ళి చేసుకోవ‌చ్చు కానీ ఇలా బిజినెస్‌మ్యాన్ కూతుర్ని పెళ్ళాడ‌టానికి కార‌ణం ఏమిటంటే సినిమావాళ్ళ‌ని ఎవ‌రినైనా చేసుకోవ‌చ్చుకాని. ఇంటికి వ‌చ్చాక నా సినీ ప్ర‌పంచానికి సంబంధం లేని అమ్మాయిని కావాల‌నుకున్నాను నేను అని ఆయ‌న ఓసారి మీడియా స‌మ‌క్షంలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: