మెగా ఫ్యామిలీ రాజకీయాల్లో అడుగు పెట్టాలి అనేది చాలా మంది ఆశ. అయితే వారి ఆశలు పదేళ్ళ క్రితమే ఆవిరి అయిపోయాయి. రాజకీయంగా చిరంజీవి సత్తా చాటాలని ఎందరో కోరుకున్నారు. అందులో మెగా ఫ్యామిలీ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవికి యూత్ లో క్రేజ్ ఎక్కువ. ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరింది కూడా యువతే. అలాంటి యువత కోసం ప్రజారాజ్యం అని స్థాపించారు చిరంజీవి. ప్రజలకు సేవ చెయ్యాలని సేవే మార్గం అంటూ ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 

 

అయితే ఆ పార్టీ పెట్టిన రెండు మూడు ఏళ్ళకే కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఈ పరిణామం మెగా ఫ్యామిలీ లో చాలా మంది జీర్ణించుకోలేని పరిస్తితి ఏర్పడింది. వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. ఆయనకు అసలు మెగా ఫ్యామిలీ రాజకీయాల్లో ఉండటం ఏ మాత్రం ఇష్టం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి అప్పట్లో. మనం సినిమాల్లో మాత్రమే ప్రజలకు దగ్గరయ్యామని, పరిపాలనా, రాజకీయం అనేవి పూర్తిగా భిన్నంగా ఉంటాయని, అలాంటి వాటిల్లోకి అనవసరంగా వెళ్తే ప్రయోజనం తక్కువ అని అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ కి కూడా చెప్పినట్టు సమాచారం. 

 

మనని సినిమాల పరంగా ప్రజలు ఆదరిస్తారని, ఇలాంటివి మనకి వద్దని ఆయన తన అభిప్రాయం చెప్పారట అప్పట్లో. ముఖ్యంగా యువత ఫాలోయింగ్ ఓటు బ్యాంకు అయ్యే అవకాశాలు తక్కువ అని ఆ రోజే ఆయన అంచనా వేసారట. ఇక పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ విభేధించడానికి రాజకీయాలే కారణమని అంటున్నారు. అక్కడి నుంచి మెగా ఫ్యామిలీ కి అల్లు అర్జున్ దూరంగా జరిగారని అంటున్నారు. అక్కడి నుంచే అల్లు అర్జున్ దూరంగా ఉండటం, కుటుంబ కార్యక్రమాలకు కూడా హాజరు కాకుండా ఉన్నారని, మెగా ఫాన్స్ పై విమర్శలు చేసారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: