టాలీవుడ్ లో డాన్స్ రాకపోయినా చాలా మంది స్టార్ ఇమేజ్ తో సినిమాల్లో కొనసాగుతున్నారు. చాలా మంది పెద్ద ఫ్యామిలీ ల నుంచి వచ్చిన హీరోలకు డాన్స్ రాదు. నేడు సూపర్ స్టార్స్ గా ఉన్న వారు చాలా మంది డాన్స్ రాక ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాని మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ మాత్రం తన సినిమాల్లో డాన్స్ కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు అనేది వాస్తవం. తన సినిమాల్లో ఎక్కువగా డాన్స్ ఉండే విధంగా చూసుకుంటాడు అల్లు అర్జున్. 

 

ఏ స్టెప్ అయినా సరే అవలీలగా వేయడం అతనికి మాత్రమే సాధ్యమైన విద్య. హీరోయిన్ ని కాళ్ళ మీద కూర్చోపెట్టుకుని అయినా హీరోయిన్ ని భుజం మీద కూర్చోపెట్టుకుని అయినా సరే అతను ఏ స్టెప్ అయినా సరే వేయగలిగే సమర్ధుడు. దీనితో అతని సినిమాల్లో పాటల్లో డాన్స్ ఎక్కువగా ఉండే విధంగా చూస్తూ ఉంటారు. అతని డాన్స్ గురించి ఎందరో హీరోయిన్స్ ప్రసంశలు కూడా ఇచ్చారు. టాలీవుడ్ లో చాలా మంది అగ్ర దర్శకులు అతని డాన్స్ చూసి ఫిదా అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో అతి తక్కువ మంది హీరోల్లో డాన్సర్ లు ఉన్నారు. గతంలో చిరంజీవి, బాలకృష్ణ ఇలా కొంత మంది ఉండే వారు. ఈ తరంలో మాత్రం అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు డాన్స్ లో దుమ్ము రేపుతున్నారు. అందుకే వారి సినిమాల్లో డాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనేది వాస్తవం. సోషల్ మీడియాలో కూడా అతని డాన్స్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా అల్లు అర్జున్ మంచి డాన్సర్ గా అతి తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: