టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  గంగోత్రి మూవీతో తన ప్రస్థానం మొదలు పెట్టినా దేశముదురు,ఆర్య,బన్ని లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.  డ్యాన్స్, ఫైట్స్ విషయంలో బన్నీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.  వెండితెరపై బన్నీ కనిపిస్తే చాలు ఆయన డ్యాన్స్ కోసం పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు.  రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  

 

తనను ఎంతోగానే ఇష్టపడే స్నేహారెడ్డిని అల్లు అర్జున్ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.  సినీ పరిశ్రమంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న తమ కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించే వారిలో అల్లు అర్జున్ ఒకరు.  ఆయనకు ఓ బాబు, కూతురు ఉన్నారు.  ఇక వైవాహిక జీవితంలో బన్నీ ఎప్పుడూ సంతోషాంగానే ఉన్నానని పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అల వైకుంఠపురములో..` సినిమాతో ఘనవిజయం అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు.

 

శేషాచలం అడవుల బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్ తో కనిపించబోతున్నట్లు టాక్.  ఇప్పటికే ఆయన లుక్ పరంగా కూడా చాలా చెంజ్ కనిపిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బన్నీ తన భార్య గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు. మహిళా అభిమానుల విషయంలో తన భార్య చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని చెప్పాడు.  నాకు ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు.. అయితే నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా కూడా లేడీ అభిమానుల విషయంలో నా భార్య చాలా సీరియస్ గానే ఉంటుంద‌`ని బన్నీ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: