కరోనా  వైరస్ తో ప్రపంచంలో చాల రంగాలమీద ఎఫెక్ట్ పడినట్టే.. మూవీ ఇండస్ట్రీ మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఈ కరోనా ఎఫెక్ట్ తో హాలీవుడ్ నుంచి లోకల్ సినిమాల వరకూ షూటింగులు, ప్రమోషన్లు, రిలీజ్ లు ఇలా అన్నీ   పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ వైరస్ తో సినిమా కలెక్షన్ల మీద కూడా పెద్ద దెబ్బే పడొచ్చని వర్రీ అవుతున్నారు మేకర్స్ . 

 

ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని  వీసాలు రెడీ చేసుకుని బ్యాగులు ప్యాక్ చేసుకుని షూటింగ్ కి, ప్రమోషన్లకు వెళ్దామనుకున్న  సినిమా వాళ్లకు కరోనా గట్టి దెబ్బే కొట్టింది. నాగార్జున మూవీ వైల్డ్ డాగ్  కరోనా వైరస్ కు ఎఫెక్ట్ అయ్యింది. క్రైమ్ యాక్షన్  థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ కోసం బ్యాంకాక్ షెడ్యూల్ ప్లాన్ చేసింది యూనిట్. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ తో బ్యాంకాక్ కి వెళ్ళడానికి రిస్ట్రిక్షన్స్ ఉండడంతో ఈ సినిమా షూట్ ని పోస్ట్ పోన్ చేసింది టీమ్. 

 

రామ్ గోపాల్ వర్మ ..  ఎంటర్ ద గర్ల్ డ్రాగన్  అనే మార్షల్ ఆర్ట్స్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇండో చైనీస్ మ్యూచ్యువల్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమా బ్రూస్ లీ కి వీరాభిమాని అయిన ఓ అమ్మాయి బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. ఈ సినిమాకు సంబందించి కొన్ని సీన్స్ ని చైనా పరిసర ప్రాంతాల్లో షూట్ చెయ్యాల్సి ఉంది. కానీ .. ప్రస్తుతం చైనాలో  విపరీతంగా ఉన్న కరోనా వైరస్ వల్ల  రెడ్ అలర్ట్‌ అనౌన్స్ చెయ్యడంతో  షూట్ క్యాన్సిల్ చేసుకున్నారు వర్మ అండ్ బ్యాచ్. 

 

కమల్ హాసన్ లీడ్ రోల్ లో వస్తున్న భారతీయుడు  2 కూడా ఈ వైరస్ కి ఎఫెక్ట్ అయ్యింది. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి చైనాలో చాలా లొకేషన్లలో షెడ్యూల్ ప్లాన్ చేశాడు. కానీ ప్రజెంట్ షూటింగ్ కాదు కదా..అసలు చైనాలో అడుగుపెట్టే పరిస్తితి కూడా లేదు. అందుకే చైనా షెడ్యూల్ని కంప్లీట్ గా ఎత్తేసి వేరే చోట ప్లాన్ చెయ్యాలని డిసైడ్ అయ్యారట యూనిట్. 

 

ఇప్పటికే వరల్డ్ లో 100 దేశాలకు స్ప్రెడ్ అయిన కరోనా వైరస్ వల్ల హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమా షూటింగులు,  రిలేటెడ్ ప్రమోషన్స్  ఆగిపోయాయి. టామ్ క్రూజ్ లీడ్ రోల్ చేస్తున్న మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ 7 కు సంబందించి షూట్ ని ఇటలీలో ప్లాన్ చేసింది టీమ్. కానీ అక్కడ కూడా కరోనా పాజిటివ్ ఎక్కువగా ఉండడంతో రిస్క్ తీస్కోవడం ఇష్టంలేక షూట్ పోస్ట్ పోన్ చేసుకున్నారు.

 

బాండ్ సిరీస్ లో 25 వ సినిమాగా వస్తున్న నో టైమ్ టూ డై సినిమా ఏప్రిల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినమాకు సంబందించి ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్ లో. అందుకే ప్రమోషన్స్ కోసం చైనాతో పాటు ఇ:కొన్ని చోట్ల ప్రమోషన్ టూర్స్ ప్లాన్ చేశారు. కానీ ప్రమోషన్ల సంగతి దేవుడెరుగు..ప్రాణాలు దక్కితే చాలు అనుకుంటూ.. టూర్స్ ని క్యాన్సిల్ చేశారు. ఇలా చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ  సినిమాలు డిలే అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: