తెలుగు చిత్ర పరిశ్రమలో ఉదయ్ కిరణ్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. చేసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉండేలా అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే టాలీవుడ్ లో ఒక్కసారిగా ఎవరికీ అందని విధంగా స్పీడ్ గా ఎదిగాడు ఉదయ్ కిరణ్. ఇక ఆ తర్వాత ఎంత స్పీడ్ గా తెర మీదికి వచ్చి స్టార్ హీరోగా మారాడు... అంతే వేగంగా డౌన్ఫాల్ కూడా అయ్యాడు. కెరియర్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు సహా పలు కారణాల దృష్ట్యా ఉదయ్ కిరణ్ కెరీర్ మొత్తం పాడైపోయింది. చివరికి సొంతంగా నిర్మించిన సినిమాలు కూడా ఆడకపోవడంతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునేంత వరకు వచ్చింది పరిస్థితి. ఉదయ్ కిరణ్ మరణించి ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికీ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఉదయ్ కిరణ్ ను  గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇక అటు సినిమారంగంలో కూడా ఉదయ్ కిరణ్ ఎదగడానికి కష్టపడిన తీరును చాలామంది నెమరువేసుకున్నారు. 

 

 ఉదయ్ కిరణ్ కి సునీల్ కి మంచి స్నేహ బంధం ఉంది అన్న విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ కూడా ఎంతో అలరించేది ప్రేక్షకులను. ఇక వీరిద్దరూ సినిమాలో ఉన్నారు అంటే మంచి కామెడీ సీన్స్ పండి  పండి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునే వారు.. అయితే సునీల్ ఇప్పటికీ ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలు లోనే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన సునీల్ ఉదయ్ కిరణ్ సినిమాల్లో  ఎదగడం కోసం ఏ స్థాయిలో కష్టపడేవారు చెప్పుకొచ్చాడు. నువ్వు నేను అనే సినిమా చిత్రీకరణ సమయంలో.. దర్శకుడు తేజ ఓ రన్నింగ్ సీన్  చిత్రీకరించాలి  అనుకున్నప్పుడు... ప్రొఫెషనల్ రన్నర్స్  నీ దర్శకుడు తేజ ఆ సీన్ కోసం తీసుకొచ్చాడట.. వారిని ఓడించి  పరిగెత్తి ఉదయ్ కిరణ్  గెలవవలసి ఉంటుంది. ఇక సీన్  ప్రారంభం అవ్వగానే నిజంగానే ఉదయ్ కిరణ్ రన్నర్స్  ని కూడా భీట్ చేసి ముందుకు పరుగెత్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. 

 


 అయితే సీన్ పూర్తయిన తర్వాత అంత స్పీడుగా ఎలా పరిగెత్తగలిగావు అంటూ ఉదయ్ కిరణ్ ను అడిగితే... అప్పట్లో బస్సుల వెనుక పరిగెత్తే వాడినని...ఆ  అనుభవం ఇప్పుడు ఉపయోగపడింది అంటూ ఉదయ్ కిరణ్ నవ్వాడు అంటూ  సునీల్  చెప్పాడు. ఉదయ్ కిరణ్  అప్పట్లో అందరితో కలివిడిగా ఉంటూ ఎంతో సరదాగా ఉండే వాడు అంటూ గుర్తు చేసుకున్నారు సునీల్. తమ మధ్య మధ్య స్నేహపూర్వక సంబంధం ఉందని ... ఉదయ్ కిరణ్ ఇప్పటికే గుర్తొస్తూనే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సునీల్ ఇంకా ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలు లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: