త‌మిళ అగ్ర న‌టుడు, ఇళ‌య ద‌ళ‌ప‌తి హీరో విజ‌య్ నివాసంలో ఐటీశాఖ దాడుల‌కు దిగ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.  గ‌త నెల‌లో కూడా విజ‌య్ ఇండ్ల‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున అక్ర‌మాస్తులు క‌లిగి ఉన్న‌ట్లు పేర్కొన్నారు. తాజాగా నెల రోజుల వ్య‌వ‌ధిలోనే రెండోసారి అధికారులు విజ‌య్‌ ఇంట్లో సోదాలు జ‌ర‌ప‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. గ‌తంలో దాడుల‌కు కొన‌సాగింపుగానే ప్ర‌స్తుతం దాడులు జ‌రుపుతున్న‌ట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే హీరో విజ‌య్‌పై అధికారులు క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న అభిమానులు , ప‌లువురు త‌మిళ న‌టులు ఆరోపిస్తున్నారు. 

 

హీరో విజ‌య్‌పై వ‌రుస‌గా ఐటీశాఖ దాడుల‌కు దిగ‌డం వెనున ఆంత‌ర్యం ఏమిటి..  కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఆయ‌నపై క‌క్ష్య క‌ట్ట‌డానికి గ‌ల కా ర‌ణ‌మేంటి.. ఇప్పుడిదే త‌మిళ‌నాట హాట్ టాపిక్ అవుతోంది. వాస్త‌వానికి హీరో విజ‌య్‌కి రాజ‌కీయాల‌తో ఎలాంటి సంబంధంలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ య‌న ఏ ఎన్నిక‌ల్లోనూ ఫ‌లానా పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ మిగ‌తా పెద్ద హీరోల‌ను వదిలేసి, కేవ‌లం విజ‌య్‌ను టార్గెట్ గా చేసి ఐటీ దాడులు నిర్వ‌హించ‌డం ఏమిట‌నేది అంతుబ‌ట్ట‌డంలేదు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వ‌మే విజ‌య్‌ను ఇబ్బందుల పాలు చేయ‌డాని కి ఐటీ దాడులు చేయిస్తోంద‌ని ఆయ‌న‌ అభిమానుల‌తోపాటు ప‌లువురు త‌మిళ న‌టులు అనుమానం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. 

 

గ‌తంలో విజ‌య్ న‌టించిన మెర్సీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబ‌ట్టిన ఔసంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్‌లు, స‌న్నివేశాలు హిందూ మ‌తాన్ని కించ‌ప‌ర్చేలా ఉన్నాయని అప్ప‌ట్లో ప‌లు హిందూ సంఘాల‌తో పాటు రాష్ఱంలో బీజేపీ  ఆందోళ‌న‌లు చేప‌ట్టింది.  అయితే మ‌ద్రాస్ హై కోర్టు నుంచి క్లీన్‌చిట్ రావ‌డం,  అదే స‌మ‌యంలో త‌మిళ న‌టులంతా విజ‌య్‌కు బాస‌ట‌గా నిలవ‌డంతో వివాదం సద్దుమ‌ణిగింది. ఇక అప్ప‌టి నుంచే బీజేపీకి, హీరో విజ‌య్‌కి మ‌ధ్య వివాదం రాజుకున్న‌ట్లు స‌మాచారం. ఈక్ర‌మంలోనే కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం క్రిస్టియ‌న్ అయిన హీరో విజ‌య్‌పై క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: