టాలీవుడ్ లో తేజ దర్శకత్వంలో ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఉదయ్ కిరన్ తర్వాత నువ్వ నేను, మనసంతా నువ్వే మరికొన్ని హిట్ సినిమాలతో ఒక్కసారే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు.  అప్పట్లో అమ్మాయిలకు క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు. హీరోగా మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలో కొన్ని కష్టాల్లో పడ్డాడు ఉదయ్ కిరణ్.  ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమయ్యాడు.  ఇక తెలుగు లో లాభం లేదనుకొని తమిళ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు.  వంబు సందై, పెన్ సింగం అనే సినిమాల్లో నటించాడు.  

 

ఆ సినిమాలు కూడా పెద్దగా పేరు తీసుకు రాలేకపోయాయి.  సినీ పరిశ్రమలో ఒక్క వెలుగు వెలిగిపోయిన ఈ హీరో నిరాశతో  మనసు విలకం కావడంతో ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది... అభిమానులను ఎంతగానో బాధించింది. అలాంటి ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఒక సంఘటనను నటుడు సునీల్ తలచుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ ఎంత సిరియస్ గా ఉంటాడో అంత హ్యూమరీజం ఉన్న వ్యక్తి అని అన్నాడు.  ‘నువ్వు నేను’ సినిమా కోసం తేజ ఒక రన్నింగ్ సీన్ ను చిత్రీకరించాలనుకున్నారు.  

 

అయితే సీన్ చాలా నేచురల్ గా ఉండాలని.. ప్రొఫెషనల్ రన్నర్స్ ని రంగంలోకి దింపాడు. వారితో పోటీ పడి ఉదయ్ కిరణ్ గెలావాలి.. అయితే నిజంగానే రన్నింగ్ లో ఉదయ్ కిరణ్ విశ్వరూపాన్ని చూపించాడు.. ఆ రన్నర్స్ తో పరుగెత్తి గెలిచాడు.  షూటింగులో వున్న మేమంతా ఆశ్చర్యపోయాము. 'అంతలా ఎలా పరిగెత్తావ్ రా' అని అడిగితే, 'సిటీ బస్సులెంట పరిగెత్తిన అనుభవం ఇప్పుడు పనికొచ్చింది' అని కామెడీ చేశాడు.  నిజంగా సునీల్ మంచి స్నేహితుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అని అన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: