చిరంజీవి, మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా వస్తుందనగానే టాలీవుడ్ లో భారీ బజ్ క్రియేట్ అయింది. మెగాస్టార్, సూపర్ స్టార్ ఇద్దరూ కలిసి నటిస్తే ఆ మూవీ ఏ రేంజ్ కు వెళ్తుందో అని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలేస్తున్నారు. అయితే ఈ అంచనాలతో పాటు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయంటోంది ఇండస్ట్రీ. 


చిరంజీవి, మహేశ్ బాబు కలిసి నటించబోతున్నారనే వార్త రావడం ఆలస్యం ఇండస్ట్రీలో భారీ బజ్ క్రియేట్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో వీళ్లిద్దరు ఎలాంటి పాత్రలు పోషిస్తారు. ఎంత బిజినెస్ చేస్తుంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ అంచనాలతో పాటే మహేశ్ రోల్ పై చాలా డౌట్స్ వస్తున్నాయి అంటున్నారు జనాలు. 

 

కొరటాల శివ సినిమాలో మహేశ్ బాబు పాత్ర ఏంటి అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆచార్య అనే టైటిల్ కు తగ్గట్టుగా చిరంజీవి లెక్చరెర్ పాత్ర పోషిస్తాడని ప్రచారం జరుగుతోంది. మరి మహేశ్ రోల్ ఏంటి.. ఆ పాత్ర ఎంతసేపు కనిపిస్తుంది.. అతని సినిమాలో హీరోయిన్ ఉందా.. అంటే ఎవరిని తీసుకుంటారు. ఇలా జనాల్లో బోల్డన్ని ప్రశఅనలు రైజ్ అవుతున్నాయి. 

 

మరోవైపు సోషల్ మీడియాలో ఆచార్య టైటిల్ మార్చుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆచార్య టైటిల్ చిరంజీవిని రిప్రజెంట్ చేస్తుంది గానీ. మహేశ్ గురించి చెప్పట్లేదనే ఆలోచనలో పడిందట యూనిట్. అందుకో హీరోలిద్దరికీ న్యాయం చేసే టైటిల్ అయితే బెటర్ అనుకుంటున్నారట. మరి సోషల్ మీడియా చెబుతున్నట్టు టైటిల్ మార్చుతారా అనేది చూడాలి. మొత్తానికి చిరంజీవి, మహేశ్ బాబు కాంబినేషన్ లో సినిమా వస్తుందనే వార్తలు ఇరువురి అభిమానుల్లో తెగ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇద్దరు కలిస్తే ఆ సినిమా ఏ స్థాయికి మూవ్ అవుతుందో ఊహల్లోకి వెళుతున్నారు. అయితే ఈ అంచనాలు ఎలా ఉన్నా.. కొన్ని అనుమానాలు మాత్రం అభిమానుల్లో నెలకొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: