ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రెచ్చిపోతుంది. దాదాపు వంద దేశాలకు ఈ వైరస్ విస్తరించిన సంగతి తెలిసిందే. దాదాపు ఈ వైరస్ బారిన... లక్ష మందికి పైగా ప్రజలు పడ్డారు. వారిలో కొందరు కోలుకుంటున్నా మరి కొందరు మాత్రం ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇక చైనాలో ఈ వైరస్ తగ్గు ముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే ఈ ప్రభావం ఇప్పుడు సినిమా మీద కూడా బలంగానే పడినట్టు కనపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా షూటింగ్ లు దాదాపుగా ఆపివేశారు. మన దేశంలో కూడా కొన్ని సినిమా షూటింగ్ లను ఆపేశారు. 

 

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకు కూడా కరోనా దెబ్బ తగిలిందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆచార్యా అనే పేరుని ఈ సినిమా టైటిల్ కి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి మావోయిస్ట్ గా నటిస్తున్నారట. ఇటీవల ఆయన లుక్ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎవరో లీక్ చేయడం తో అది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఈ లుక్ విషయంలో అనేక జాగ్రత్తలు కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. 

 

మళ్ళీ చిరంజీవి లుక్ ని మార్చే ప్రయత్నం కూడా చేసారట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు కరోనా దెబ్బ తగిలింది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. విదేశాల్లో, ఈ సినిమా షూటింగ్ కొన్ని సన్నివేశాలను చెయ్యాలని భావించారు. అయితే కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో వాటిని వాయిదా వేసుకుంది చిత్ర యూనిట్. వాటిని మన దేశంలోనే పూర్తి చేసే విధంగా కసరత్తులు చేస్తున్నారు. ఒకవేళ మన దేశంలో అలాంటి లొకేషన్ లేకపోతే మాత్రం విదేశాల్లో పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే ఆలస్యం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: