అనుష్క ప్రభాస్ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది... దాదాపు పదేళ్లుగా వస్తున్న వార్త. వీళ్ళ కాంబినేషన్ లో 2009 బిల్లా అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే వీరి మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్కౌట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వీరు ఇద్దరూ కలిసి రెండు మూడు సినిమాల్లో కలిసి నటించారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమా సూపర్ హిట్ అయింది. మిర్చి సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అయింది. ఆ తర్వాత వీరు సాహో సినిమాలో కలిసి నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. 

 

ఇది నిజం కాదని తెలిసింది. ఆ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇది పక్కన పెడితే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని, రెండు కుటుంబాలు వీరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని కొందరు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేసారు. ఇది నిజం కాదని తెలిసినా సరే అప్పుడు పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు ప్రసారం చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ కి పెళ్లి కుదిరింది అనే ప్రచారం చేయడం, టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనడం. ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. 

 

అనుష్క ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అయిపోయిన తర్వాత ప్రభాస్ ని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా పూర్తి కాగానే ఆమెతో సినిమా చేసే సూచనలు ఉన్నాయని కొందరు వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఆ సినిమాలు అయిన తర్వాత అనుష్క టాలీవుడ్ కి కూడా గుడ్ బై చెప్పేసి ప్రభాస్ తో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: