టాలీవుడ్ లో హిట్ లు ఉన్నా లేకపోయినా సరే హీరో పోతినేని రామ్ కి మాత్రం క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అతని సినిమాలకు ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. అతని సినిమా విడుదల అవుతుంది అంటే చాలు... చాలా మంది అభిమానులు ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. అతను కొన్నాళ్ళు సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డాడు. ఒక్క హిట్ వచ్చినా చాలు అనుకునే పరిస్థితి నుంచి అతను ఇప్పుడు బయటకు వచ్చినట్టే కనపడుతుంది. అతనితో సినిమాలు చెయ్యాలంటే చిన్న దర్శకులు పెద్దగా ఆసక్తి చూపించే వారు కాదు. కాని ఇప్పుడు అతనితో సినిమాలు చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. 

 

పూరి జగన్నాథ్ తో అతను చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అతని కెరీర్ ని దాదాపుగా గాడిలో పెట్టింది అనే చెప్పాలి. ఆ సినిమాలో రామ్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి అని చెప్పవచ్చు. ఇక ఆ సినిమా హిట్ అవ్వడంతో రామ్ ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అతను ప్రస్తుతం రెడ్ అనే సినిమాను తిరుమల కిషోర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాను స్రవంతి రవి కిషోర్ నిమిస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్ అయితే మాత్రం అతని కెరీర్ కచ్చితంగా గాడిలో పడినట్టే ఇక వరుస ఆఫర్లు వచ్చినట్టే. 

 

అతను హీరోగా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాడు. అతని కెరీర్ లో ఒకటో రెండో సినిమాలు మినహా చెప్పుకునే సినిమా అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్ర సీనియర్ హీరోస్ లో శర్వానంద్ రాం ముందు వరుసలో ఉన్నారు. రెడ్ సినిమా విజయం మీద అతను చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఇక అతను తిరిగి చూసుకునే అవసరం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: