తెలుగు బుల్లి తెర మీద అడుగుపెట్టిన కొన్ని రోజులకే మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ షో తర్వాత ఆమె బిజీ కూడా అయిపోయింది. అక్కడి నుంచి వరుసగా సినిమా ఆఫర్లు కూడా ఆమెను వరించాయి. అయినా సరే బుల్లి తెర మీద ఎక్కువగా దృష్టి పెట్టారు ఆమె. టాలీవుడ్ లో ఎంత మంది యాంకర్లు తర్వాత వచ్చినా సరే ఆమెకు ఉన్న గుర్తింపు మాత్రం ఎక్కడా తగ్గలేదు అనే చెప్పాలి. 

 

ప్రస్తుతం ఆమె రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాల్లో ఆమె విలన్ పాత్రలు చేస్తుంది అంటున్నారు. దీనిపై స్పష్టత లేకపోయినా సరే త్వరలో ఆమె చేసే సినిమాల గురించి మాత్రం అధికారిక ప్రకటన వచ్చే సూచనలు అయితే కనపడుతున్నాయి. ఇక బుల్లి తెర కు గుడ్ బై చెప్పి సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు కూడా ఇప్పుడు అనసూయ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త బయటకు వచ్చింది. 

 

వార్త ఏంటీ అంటే ఆమెకు బికినీ వేసే అవకాశం వచ్చిందని టాక్... ఒక గ్లామర్ పాత్రలో ఆమె నటించే అవకాశం ఉందని, ఇప్పటికే దర్శక నిర్మాతలు ఆమెతో మాట్లాడారని, అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆమెతో పాటుగా ఒక స్టార్ హీరోయిన్ కూడా ఆమె సినిమా లో నటించే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజమో గాని సోషల్ మీడియా లో మాత్రం కొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: